వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై హర్థిక్ విమర్శలు.. హిందూ అనుకూల విధానాలకు దూరం దూరం..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక హర్థిక పటేల్ స్వరం మరింత పెంచారు. ఆ పార్టీ హిందూ అనుకూల విధానాలకు దూరంగా ఉంటుందని కామెంట్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జ్ఞాన్ వాపీ మసీదు దుమారం రేగుతున్న క్రమంలో హర్థిక్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో చాలా శివుని భక్తులు ఉన్నారని.. అయితే మసీదు, ఇతర చోట శివ లింగం స్వాధీనం చేసుకుంటే మన విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. మనం దీనిని స్వాగతించాలని కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దూరంగా ఉంటున్నారని మండిపడ్డారు.

 Congress tends to move away from pro-Hindu stance: Hardik Patel

గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సుదీర్ఘ లేఖ రాశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండాల్సిన వేళ మన నాయకుడు విదేశాల్లో ఉన్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి లేఖలో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి వేదికపై కనిపించిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.

అగ్ర నాయకులను కలిసినప్పుడు.. వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలను వినకుండా ఫోన్లతో గడిపారని ఎవరి పేరును చెప్పకుండా సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం పట్ల వారికి ఆసక్తి లేదంటూ హార్దిక్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ముందుకు వెళ్లడానికి సరైన కార్యచరణ లేకపోవడంతో.. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని పటేల్ విమర్శించారు.

English summary
Patidar leader Hardik Patel trained his guns on the party, saying that its tendency to distance itself from pro-Hindu developments was hurting the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X