ఎన్‌పీఆర్ వర్సెస్ ఎన్‌ఆర్‌యూ: జాతీయ నిరుద్యోగ రిజిష్టర్‌లో 5 లక్షలకు పైగా మంది నమోదు..
జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్)తో పౌరుల జాబితా రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్ నేపథ్యంలో ఎన్‌పీఆర్‌పై కూడా సందేహాలు తలెత్తాయి. అయితే దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ జాతీయ నిరుద్యోగ రిజిష్టర్ పేరుతో జాబితా రూపొందిస్తోంది. దీంతో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది.

జన ఆక్రోశ్ ర్యాలీలో..
ఇటీవల జైపూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ‘జన్ ఆక్రోశ్ ర్యాలీ' నిర్వహించారు. ఈ సమయంలోనే జాతీయ నిరుద్యోగిత రిజిష్టర్ పేరుతో నిరుద్యోగుల జాబితా రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 8151994411 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి నమోదు చేసుకోవాలని పిలుపునివ్వగా భారీ సంఖ్యలో యువత స్పందించారు. అక్కడ బ్యానర్‌ను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. తర్వాత నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో నిరుద్యోగుల జాబితా రూపొందుతోంది. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు వివరించారు. ఇందులో ఒక్క రాజస్థాన్ నుంచే 58 వేల మందికి పైగా ఉండటం విశేషం. రాజస్థాన్ తర్వాతే మిగతా రాష్ట్రాలు నిలిచాయి.

డిగ్రీలు ఉన్నాయి.. నౌకరీ లేదు
కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీ కాకుండా జాతీయ నిరుద్యోగిత జాబితా రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. జన్ ఆక్రోశ్ ర్యాలీలో తమకు డిగ్రీలు ఉన్నాయి.. కానీ ఉద్యోగం లేదు, మా ఉద్యోగం ఎక్కడ..? ఉద్యోగం కావాలి, హామీలు కాదు అనే నినాదాలు చేశారు. రాహుల్ గాంధీతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

నమోదు చేసకొండి
జాతీయ నిరుద్యోగ యువత రిజిష్టర్‌ను మరింత విసృతం పరుస్తామని యూత్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ప్రతీ ఒక్క నిరుద్యోగి నమోదు చేసుకోవాలని కోరారు. జాబితాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళతామని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగిత సమస్య ఉన్న. కేంద్రం మాత్రం సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీ ప్రవేశపెట్టి దేశాన్ని విచ్చినం చేయాలని చూస్తోందని రాజస్థాన్ మంత్రి అశోక్ చందా పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో ఏదీ...?
కాంగ్రెస్ జాబితాపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనాలు ఏమయ్యాయని అడిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానంపై దృష్టిసారించాలని కోరారు. అది మరచి తమపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి ముఖేశ్ ఫరీక్ పేర్కొన్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications