ప్రధాని ‘జుమ్లా’ మోడీ: కాంగ్రెస్ పోస్టర్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: అధికారం కొల్పోయిన తరువాత కాంగ్రెస్ సహనం కొల్పోయినట్లుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద నిప్పులుచెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా ట్వీట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీని జుమ్లా మోడీ అంటూ వ్యంగంగా విమర్శించింది.
ప్రధాని మోడీతో పాటు బీజేపీ నాయకులతో ఓ పోస్టరు తయారు చేసింది. ఇది సినిమా పోస్టర్ అంటూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ అధికారిక ట్వీట్టర్ అకౌంట్ నుంచి ఈ పోస్టర్ తో పాటు పలు ట్వీట్ లు వ్యంగంగా పోస్టు చేశారు.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరిగిందని, అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని జుమ్లా మోడీ అంటూ కామెంట్లు చేసింది.
నటీనటులు వీరే
ఏ ఫిల్మె బై జుమ్లా ప్రోడెక్షన్స్ అంటూ ఓ పోస్టర్ తయారు చేసింది. నటీనటులు నరేంద్ర ‘జుమ్లా' మోడీ, శివరాజ్ ‘వ్యాపమ్' చౌహాన్, సుష్మా ‘మోడీ గేట్' స్వరాజ్, నూతన పరిచయం అరుణ్ ‘డీడీసీఏ' జైట్లీ అంటూ ట్వీట్ చేశారు.
జైట్లీ అవినీతి పరుడు
అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది.

మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రశ్నించారు.
సిద్దాంతాలు పాటించాలి
బీజేపీ తాను నమ్ముకున్న సిద్దాంతాలను పాటించాలని, అలాగే కుంభకోణాలకు పాల్పడిన అరుణ్ జైట్లీ వెంటనే రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఆర్ టీఐలో ఎందుకు వద్దన్నారు ?
తాము ఆర్ టీఐ బిల్లును అమలు చెయ్యడానికి ప్రయత్నించిన సందర్బంలో అరుణ్ జైట్లీ క్రీడా సంస్థలు అందులో చేర్చరాదని పట్టుబట్టారు. ఆయన ఎందుకు అలా చేశారో ఇప్పుడు అర్థం అవుతున్నదని కాంగ్రెస్ వ్యంగంగా ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications