వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: తేలని సీట్ల సర్దుబాటు, నోటిఫికేషన్ జారీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటులో ఇప్పటికే శివసేన - భాజపా కూటమిలో నెలకొన్న ప్రతిష్టంభన మారిగానే అధికార కాంగ్రెసు - ఎన్‌సీపీ కూటమిలో కూడా ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపై తేల్చేందుకు కాంగ్రెస్‌కు శనివారం 24 గంటల గడువు ఇచ్చింది.

కాంగ్రెస్ ఇస్తామన్న 124 సీట్ల ప్రతిపాదనను ఎన్‌సీపీ తిరస్కరించింది. తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్ సీపీ వైస్ ప్రెసిడెంట్ ప్రపుల్ పటేల్ శనివారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌కు మరో రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పారు.

నామినేషన్ ప్రక్రియ మొదలైనందున ఇంక వేచిచూడలేమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కన్నా తమ పార్టీయే ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుుకుందని.. దాంతో సీట్ల సర్దుబాటుపై పాత లెక్కలను అంగీకరించబోమని అన్నారు. 2004లోనే తమ పార్టీ 124 సీట్లలో పోటీ చేసిందని గుర్తు చేశారు.

Congress wary as NCP delays seat-sharing response

ఆదివారంలోగా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వకుంటే సోమవారం సీఎం పృధ్వీరాజ్ చవాన్‌తో ఈ విషయంపై మాట్లాడతామన్నారు. న్యూఢిల్లీలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్ రావ్ ధాక్రే మాట్లాడుతూ నిర్ణయం ఎన్‌సీపీకే వదిలేశామని, పాత ఫార్ములా ప్రకారం వారు సానుకూల స్పందని వ్యక్తం చేస్తారనే భావం వ్యక్తం చేశారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్దానాల్లో పోటీ చేయగా, ఎన్‌‌సీపీ 114 సీట్లలో పోటీ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 288.

నోటిఫికేషన్ జారీ:
ఈనెల 27వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
అక్టోబర్ 15వ తేదీన పోలింగ్
అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు

English summary
Congress's alliance with NCP in Maharashtra appears headed for trouble as the Sharad Pawar- led party is yet to give a "positive response" to the former's proposal for seat-sharing for the upcoming Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X