Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi : రాహుల్ భారత్ జోడో యాత్ర చేసిన సీట్లలో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందో తెలుసా ?

కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 223 సీట్లకు పోటీ చేసి 136 సీట్లలో గెలిచింది. దీంతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ మార్క్ మెజారిటీ లభించింది. రేపోమాపో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కూడా దోహదం చేసినట్లు కర్నాటక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగిందా, జరిగితే ఎంత జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీన్ని ఓసారి పరిశీలిస్తే.. రాహుల్ గాంధీ తాజాగా చేసిన భారత్ జోడో యాత్ర కర్నాటకలోని 51 సీట్ల పరిధిలో సాగింది. ఇందులో 36 సీట్లను కాంగ్రెస్ ఇవాళ గెల్చుకుంది. మిగిలిన సీట్లలో మాత్రం బీజేపీ, జేడీఎస్ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి మేలే జరిగినట్లయింది.

congress won 36 seats out of 51 in which rahul gandhi done bharat jodo yatra in karnataka

రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4,000 కి.మీల మేర సాగిన 145 రోజుల యాత్ర సెప్టెంబర్ 30, 2022న ఎన్నికల బరిలోకి దిగిన కర్ణాటకలో ప్రవేశించింది. అక్టోబర్ 23 వరకు రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులు యాత్రలో ఏడు జిల్లాలను కవర్ చేశారు. రాష్ట్రంలో చామరాజనగర్, మైసూర్, మాండ్య, తుంకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్లో ఇది సాగింది. ఈ ఏడు జిల్లాలు కర్ణాటక అసెంబ్లీలోని 224 నియోజకవర్గాల్లో 51 స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 36 స్థానాల్లో గెలిచింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కవర్ చేయబడిన నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలో మొత్తం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది, మైసూర్‌లో 11 స్థానాలు ఉండగా, వీటిలో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, మాండ్యాలో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో ఐదు స్థానాల్లో గెలిచింది. తుమకూరులో మొత్తం 11 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ ఆరింటిలో గెలిచింది, చిత్రదుర్గలో మొత్తం ఆరు స్థానాలు ఉండగా కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలిచింది. అలాగే బళ్లారిలో మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రాయచూర్‌లో మొత్తం ఏడు స్థానాలు ఉండగా వీటిలో నాలుగింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+