రాజకీయ కక్షలు: కాంగ్రెస్ నాయకుడి హత్య
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న సమయంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కేరళలోని ఈ పూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో యూత్ కాంగ్రస్ నాయకుడు మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశామని అన్నారు.
కేరళ యూత్ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ (28) మీద మంగళవారం సీపీఎంకు చెందిన డీవైఎఫ్ కార్యకర్తలు 8 మంది కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలైన సునీల్ కుమార్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సునీల్ కుమార్ మరణించాడని పోలీసు అధికారులు చెప్పారు.
డీవైఎఫ్ఐ కార్యకర్తలు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజకీయ ప్రేరిపిత హత్య జరిగిందని యూత్ కాంగ్రెస్ నాయకులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా సునీల్ కుమార్ ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
పలు ప్రాంతాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, రాస్తా రాకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కోట్టాయి కోణంలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరస్పర దాడుల్లో 30 మందికి తీవ్రగాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. కేరళలో సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications