ఉత్కంఠ రేపుతున్న పంజాబ్ పోలింగ్.. తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవలలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. అధికారం కోసం ప్రచారంలో హోరెత్తించిన పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన నెలకొంది. కులాలు, మతాల వారిగా ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.
Recommended Video
ప్రత్యేక ఆకర్షణగా అవిభక్త కవలలు
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. పార్టీల అగ్రనేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా అవిభక్త కవలలు సోహ్నా సింగ్, మెహ్నా సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తొలిసారిగా ఓటు వేయడంపై ఆనందం
ఒకే శరీరాన్ని పంచుకున్న సోహ్నా, మోహ్నా సింగ్‌లకు ఎన్నికల కమిషన్ వేర్వేరుగా ఓటు హక్కు కల్పించారు. అమృతసర్‌లోని మనావాలాలో సోదరులు తమ ఓటు వేశారు. వేర్వేరుగా ఓటు వేయడం పట్ల సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. 2002 జూన్ 13న జన్మించిన ఈ కవలలు 2020లో 18 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఈసీ వారికి వేర్వేరుగా ఓటరు కార్డులన అందించింది.

గెలుపుపై ఎవరి లెక్కలు వారివి..
పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో 1,304 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 2.14 కోట్ల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications