వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP Elections 2022 : రామ్ మందిర నిర్మాణం బీజేపీకి కలిసి వస్తుందా : ఏబీపీ- సీ ఓటరు సర్వేలో తేలిందేంటి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మరి కొద్ది నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకొనేందుకు అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం తమ వ్యూహాల్లో తాము నిమగ్నమయ్యాయి. ఇక, ఇదే సమయంలో అసలు అయోధ్యలో రామ మందిరం అంశం బీజేపీకి కలిసి వస్తుందా లేదా అనే అంశం పైన ఏబీపీ- సీ ఓటరు సర్వే నిర్వహించింది. అందులో ఇదే ప్రధాన అంశం పైన స్థానిక ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్ని చేసింది.

అయితే, యూపీలో కేవలం రామమందిరం అంశమే కాకుండా స్థానికంగా ఉన్న పలు సమస్యలు..అనేక అంశాలు ఓటర్ల పైన ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం.. రైతుల సమస్యలు..మహిళా భద్రత కీలక అంశాలుగా మారగా, వీటితో పాటుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం సైతం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. సుదీర్ఘ కాలంగా వివాదాస్పదంగా మారిన అయోధ్య రామ మందిరం అంశంలో 2019లో సుప్రీం కోర్టులో పరిష్కారం అయింది. కోర్టుతో రామ మందిర నిర్మాణం ఆరంభమైంది. బాబ్రీ మసీదు కూల్చి వేసి 29 ఏళ్లు అవుతుండటంతో ఈ అంశం పైన సర్వే నిర్వహించారు.

construction of the Ram Mandir in Ayodhya, and how much impact will it have during the UP assembly election 2022

బీజేపీ.. కాంగ్రెస్..సమాజ్ వాదీ పార్టీ తో పాటుగా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు దారుల స్పందన సైతం సేకరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం వల్ల అధికార బీజేపీకి లాభం చేకూరుతుందని 58.6% మంది అభిప్రాయపడగా, 41.4% మంది ప్రజలు బీజేపీకి లాభం చేకూర్చలేదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా.. ప్రత్యేక డేటా ప్రకారం 79.2% BJP మద్దతుదారులు, 51.9% కాంగ్రెస్ మద్దతుదారులు, 31.3% SP మద్దతుదారులు మరియు 35.7% BSP మద్దతుదారులు రామమందిర నిర్మాణం బిజెపికి ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వీటితొ పాటుగా ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రామమందిరానికి మీరు ఎంత క్రెడిట్ ఇస్తారు అనే ప్రశ్న పైన సమాధానం రాబట్టే ప్రయత్నం చేసారు.

ఎన్నికల్లో భాజపా గెలిస్తే రామమందిర నిర్మాణ ఘనత తమదేనని మొత్తం 50.6% మంది అభిప్రాయపడ్డారు. రామ మందిర నిర్మాణంలో భాజపా విజయాన్ని జమ చేయబోమని 28% మంది చెప్పగా, 21.4% మంది రామమందిర నిర్మాణానికి జమ చేస్తారో లేదో తెలియదని చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఎన్నికల్లో 59.3% BJP మద్దతుదారులు, 43.2% కాంగ్రెస్ మద్దతుదారులు, 34.2% SP మద్దతుదారులు, 46.7% BSP మద్దతుదారులు రామ మందిర నిర్మాణానికి బిజెపిని గెలిపిస్తామని చెప్పారు.

English summary
ABP C Voter survey on Ram Mandir in Ayodhya, and how much impact will it have during the UP assembly election 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X