ఎంజీఆర్, జయ తరువాత ఎవరో మాకు తెలుసు: అందుకే ?
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం మా పార్టీలోని సీనియర్లు చాల మంది పోటీలో ఉన్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఏమీ లేదని, పార్టీలో అందరూ కలసికట్టుగా ఉన్నారని చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీలోని సీనియర్లు పోటీలో ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజయం లేదని ఆపార్టీ అధికార ప్రతినిధి సీ. పొన్నియన్ అన్నారు. శనివారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం మా పార్టీలోని సీనియర్లు చాల మంది పోటీలో ఉన్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఏమీ లేదని, పార్టీలో అందరూ కలసికట్టుగా ఉన్నారని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత ఆశయాలను ముందుకు నడిపించే వ్యక్తిని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని అన్నారు. పార్టీ శాసన సభ్యులు అందరూ కలసి ఒకే వ్యక్తిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాయని ఆయన గుర్తు చేశారు.
పొన్నియన్ పరోక్షంగా జయలలిత నెచ్చెలి శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారని చెప్పకనే చెప్పారు. ఒక్కరే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానికి పోటీలో ఉన్నారని పొన్నియన్ మరో సారి చెప్పడంతో శశికళనే రేసులో ఉన్నారని పార్టీ కార్యకర్తలకు అర్థం అయ్యింది.

Click it and Unblock the Notifications