మిని స్కర్ట్ రాధే మాకు మళ్లీ కష్టాలు వచ్చాయి

ముంబై/హర్యానా: ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు మళ్లీ కష్టాలు వచ్చాయి. ఇప్పటికే వరకట్నం వేధింపుల కేసుతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కోంటున్న రాధే మా విషయంలో మరో కేసు విచారణకు రంగం సిద్దం అయ్యింది.

మూడు నెలలలోపు విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని హర్యానా హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ లోని ఫగ్వార ప్రాంతానికి చెందిన సురేంద్ర మిత్తల్ అనే వ్యక్తి హర్యానా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా మీద ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని, కేసులు నమోదు అయ్యాయని ఆయన కోర్టులో మనవి చేశారు. ఈ కేసుల విచారణ ఇంకా పూర్తి కాలేదని అన్నారు.

Controversial Godwoman Radhe Maa new case

అయితే రాధే మా తాను దుర్గాదేవి అవతారం అంటూ దేవుడికి వేసే దస్తులు ధరించి అధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. చేతిలో త్రిశూలం పెట్టుకుని భక్తులను మాయ చేస్తున్నారని చెప్పారు.

వివరాలు తెలుసుకున్న హర్యానా హైకోర్టు మూడు నెలల్లలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కపుర్థాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాధే మా ఇప్పటికే బాంబే హైకోర్టులో బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు మరో కేసు విచారణ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+