Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే!

ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అనేక రంగాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా చమురు ఉత్పత్తుల పైన ప్రజలలో ఆందోళనను కలిగిస్తుంది. ఇలా ఉంటే యుద్ధ పరిస్థితులు వంటనూనెల పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తాజాగా పెరిగిన ధరలతో తెలుస్తోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రజల దైనందిన జీవితం పైన భారం మోపుతోంది. పెరిగిన ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.

వంట నూనె సరఫరాపైన పడిన ప్రభావం

యుద్ధ పరిస్థితులతో వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. లీటరుకు పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు వంట నూనెల ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సరఫరా లో అంతరాయాలు దిగిన సరుకు రవాణా ధరలు ఇరాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న భయాందోళనల కారణంగా వంట నూనె సరఫరా పైన పడిన ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైంది.

Cooking Oil Prices Rise with iran israel america war Strait of Hormuz closure is the main reason

హార్ముజ్ జలసంధిని మూసివేయడమే ధరల పెరుగుదలకు కారణం

హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. దీనివల్ల పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరాలో జాప్యం జరుగుతుంది. యుద్ధం కొనసాగితే మరింతగా ధరలు పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలకు ముఖ్యంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడమే కారణమని భావిస్తున్నారు. మన దేశానికి కావాల్సిన వంట నూనె ముడిసరుకు జలమార్గం ద్వారానే చేరుతుండగా, యుద్ధానికి ముందే ధరలు రూ.120 నుండి రూ.140-150కి చేరాయి.

ప్రస్తుతం వంట నూనెల ధరలు ఇలా

ప్రస్తుతం లీటరు ప్యాకెట్ వంట నూనె ధర 170 రూపాయలు కాగా, అదనంగా మరో 10 రూపాయలు కలిపి 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనె ధరలు పెరిగి, కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇక ఈ పరిస్థితులు ఇలానే ఉంటే సామాన్యులు కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రజలపైన ఆర్ధిక భారం

ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై గణనీయంగా పడుతుంది. అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రజల దినసరి ఖర్చు పెరుగుతున్న ధరలతో బాగా పెరిగిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+