మరో ఉగ్ర ఘాతుకం: పోలీసును కిడ్నాప్ చేసి, కాల్చి చంపేశారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. జావేద్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ను గురువారం రాత్రి షోపియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన ఉగ్రవాదులు.. ఆయనను తుపాకులతో కాల్చి దారుణంగా హత్యచేశారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రాకు వ్యక్తిగత భద్రత కోసం నియమించిన జావేద్‌ను కచ్‌దూరా గ్రామంలోని ఆయన ఇంటి నుంచి గురువారం రాత్రి సాయుధులైన ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.

ఉగ్రవాదులు జావేద్‌ను తలలో కాల్చి చంపేశారని పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని సెహ్‌పొరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభించినట్లు తెలిపారు. కచ్‌దూరా గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భద్రతాసిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు కానిస్టేబుల్‌ను అపహరించి చంపేసినట్లు తెలుస్తోంది.
కాగా, జూన్ నెలలో పుల్వామా జిల్లాలో ఔరంగజేబు అనే సైనికుడిని కూడా ఉగ్రవాదులు అపహరించి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని హత్య చేశారు ఉగ్రవాదులు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications