ఎస్ఐ కూతురు భలే కిలాడీ బాసు: ఎం చేసిందంటే?
న్యూఢిల్లీ: ఆమె ఓ పోలీసు అధికారి కూతురు. తన తండ్రితో పాటు పని చేస్తున్న సాటి పోలీసులకు మాత్రం చుక్కలు చూపించింది. ఎట్టకేలకు పట్టుబడటంతో ఆమె అసలు రంగు భయటపడింది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కుమార్తెను పోషించడానికి దొంగగా మారిందని ఢిల్లీ నగర డీసీపి మిలింద్ మహదేవ్ చెప్పారు.
ఢిల్లీలో ఎస్ఐగా పని చేస్తున్న ఆయన కుమార్తెకు పెళ్లి అయ్యింది. ఆమెకు 8 సంవత్సరాల కుమార్తె ఉంది. భర్త వేధింపులతో విసిగిపోయి అతనికి దూరంగా ఉంటున్నది. ఈమె నెంబర్ ఫ్లేట్ లేని కారులో తిరుగుతూ కళాశాల అమ్మాయిలను లక్షంగా చేసుకుని మొబైల్స్ లూటీ చేస్తున్నది.

తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. తరువాత ఒంటరిగా ఉన్న అమ్మాయిలు కనపడితే కారు నిలిపి తన ఫోన్ పని చెయ్యడం లేదని, ఓ ఫోన్ చేసుకుంటానని వారిని నమ్మించింది. అమ్మాయిలు ఫోన్ ఇచ్చిన తరువాత కారులో అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా ఢిల్లీలోని మోడల్ టౌన్, ముఖర్జీనగర్, మారీస్ నగర్, రూప్ నగర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్స్ చోరీ చేసింది.
ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు తలలుపట్టుకున్నారు. చివరికి ఆమెను పట్టుకుని విచారించగా షాక్ కు గురైనారు. తమతో పాటు ఎస్ఐగా పని చేస్తున్న కుమార్తె అని తెలుసుకుని విస్తుపోయామని డీసీపీ మిలింద్ మహదేవ్ అన్నారు. తన 8 ఏళ్ల కుమార్తె ఆలనాపాటన చూసుకోవడానికి తాను మొబైల్స్ చోరీ చేస్తున్నానని ఆమె విచారణలో అంగీకరించింది.
మహిళతో కలిసి మొబైల్స్ చోరీ చేస్తున్న నీరజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యతో సఖ్యత లేకపోవడంతో తన ఐదేళ్ల కుమార్తెకు బోమ్మలు తదితర వస్తువులు కొనిచ్చేందుకు చోరీలు చేస్తున్నాని విచారణలో నీరజ్ అంగీకరించాడని డీసీపీ మిలింద్ మహదేవ్ వివరించారు.












Click it and Unblock the Notifications