మందులోకి నీళ్లివ్వలేదని పోలీసునే కాల్చేశారు

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీళ్లు ఇవ్వలేదని నెపంతో కొందరు మందుబాబులు ఓ పోలీసును కాల్చి చంపారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుదేశ్ యాదవ్(32) అనే పోలీసు మృతి చెందాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో గందరగోళం సృష్టిస్తున్న ముగ్గురు వ్యక్తులకు సర్ది చెప్పేందుకు వెళ్లిన సుదేశ్‌తో వారు గొడవ పడ్డారు. కాగా, తమ మద్యంలో కలుపుకునేందుకు నీళ్లు తేవాలని సుదేశ్‌నే ఆదేశించారు మందుబాబులు. దీనికి అతడు అంగీకరించలేదు.

Cop shot dead by wedding guests for not giving water for their drinks

దీంతో ఆగ్రహానికి గురైన మందుబాబుల్లో ఒకడు తుపాకీ తీసి అతడ్ని కాల్చి చంపేశాడు. ఓ వివాహానికి వచ్చిన నిందితులు పోలీస్ పోస్ట్ సమీపంలోని మందుతాగుతూ ఉన్నారని పోలీసులు తెలిపారు.

బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో సుదేశ్ అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+