coromandel express accident: ఈ ఐదు రైళ్లు రద్దు, మరో ఐదు రైళ్ల దారిమళ్లింపు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని పాస్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం 50 మంది మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా స్టేషన్, తమిళనాడులోని చెన్నై మధ్య నడుస్తుంది.

బహ్నాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ఐదు రైళ్లు రద్దు చేయబడ్డాయి. 5 రైళ్ల మార్గాన్ని దారి మళ్లించారు. ఈ రైలు ప్రమాదం తర్వాత రద్దు చేయబడిన రైళ్లలో పూరీ ఎక్స్‌ప్రెస్ 12837, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 12863, సంత్రాగచ్చి పూరి స్పెషల్ 02837, షాలిమార్ సంబల్‌పూర్ 20831, చెన్నై మెయిల్ 12839 ఉన్నాయి. మరోవైపు, ఈ రైలు ప్రమాదం తర్వాత, తూర్పు రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం సీల్దా-పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ జూన్ 2 రాత్రి 8 గంటలకు సీల్దా నుంచి బయలుదేరింది.

అంతకుముందు జరిగిన పరిణామాలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.

తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

 coromandel express accident in odisha: Five trains cancelled 5 trains diverted

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్‌కతా వెళుతోంది. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 60 అంబులెన్స్ లు సేవలందిస్తున్నాయి.

కాగా, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్ వద్ద ఈ సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమయన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైనవారు 033- 22143526/ 22535185 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+