4th వేవ్ ముప్పు.. ఎప్పటినుంచి అంటే.. కాన్పూర్ శాస్త్రవేత్తల లెక్క ఇదీ..
ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో కానీ.. దేశంలో కానీ కరోనా వైరస్ తీవ్రత అంతగా లేదు. ఇప్పుడు జనం అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు డోసులు పడటం.. బూస్టర్ డోసు వేసుకోవడంతో రిలాక్స్ అయ్యారు. అయితే వారందరికీ పిడుగు లాంటి వార్తను శాస్త్రవేత్తలు చెప్పారు. అవును ఫోర్త్ వేవ్ రాబోతుందని.. జాగ్రత్త అని చెప్పింది. అయితే వేరియంట్లు, తీవ్రత గురించి మాత్రం తెలియజేయలేదు.

4 నెలలే గ్యాప్..
దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ఎప్పుడు వచ్చే అంశాన్ని సైంటిస్టులు తెలియజేశారు. సెకండ్‌వేవ్ నుంచి థర్డ్‌వేవ్‌కు 6 నెలల గ్యాప్ ఉంటే.. ఈ సారి 4 నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది. కరోనా లేదని అనుకునేలోపే సైంటిస్టులు బాంబు పేల్చారు. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయం ఉందని తేల్చిచెప్పారు. వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్ మొదలవుతుందని.. అది అక్టోబర్ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. కొద్ది రోజులుగా రోజువారి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశ దాదాపు ముగిసినట్లేనని చల్లని కబురు చెప్పారు. కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమై.. 4 నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.

తీవ్రత ఎలా అంటే..
నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని వివరించారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో కచ్చితమైన అంచనా వేసింది.

ఇప్పుడు మాత్రం తగ్గుముఖం
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో శనివారం కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు, దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య 5,13,724కి చేరింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.54 శాతానికి మెరుగు పడింది.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications