వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ షురూ.. 5.75 కోట్ల మందికి పంపిణీ.. తీసుకున్న త‌ర్వాత ఆ పని చేయ‌కూడ‌దు.!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. దేశ వ్యాప్తంగా బూస్టర్ డోస్‌ను ప్రారంభించింది. తొలుత 60 ఏళ్లు దాటిన వృద్ధులకు , ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు ఈ థర్డ్ డోసును వేస్తున్నారు. మొత్తం 5.75 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఈ థర్డ్ డోస్ తీసుకోవడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Recommended Video

Flurona: COVID And Flu Mix Double Infection కోవిడ్ - ఫ్లూ నుండి ఫ్లూరోనా | Oneindia Telugu
దేశవ్యాప్తంగా 5.75 కోట్లమందికి బూస్టర్ డోస్

దేశవ్యాప్తంగా 5.75 కోట్లమందికి బూస్టర్ డోస్


దేశ వ్యాప్తంగా బూస్టర్ డోస్‌ను ఇవాళ కేంద్రం ప్రారంభించింది. ఈ బూస్టర్ డోస్‌ను తీసుకునేందుకు 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్ లైన్ వారియర్లు, హెల్త్ కేర్ వర్కర్లు అర్హులుగా నిర్థారించింది. తొలి విడత 5.75 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. వారిలో 2.75 కోట్ల మంది 60 ఏళ్లు పెబడిన వారు కాగా, ఫ్రంట్ లైన్ వర్కర్లు 1.9 కోట్ల మంది, హెల్త్ కేర్ వర్కర్లు 1.05 మంది ఉన్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అర్హులైన వారు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి ఈ బూస్టర్ డోస్‌ను వేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ వ్యాక్సిన కోసం ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవ‌స‌రం లేదని తెలిపింది.

మిక్స్ డ్ వ్యాక్సినేషన్ తీసుకోరాదు..

మిక్స్ డ్ వ్యాక్సినేషన్ తీసుకోరాదు..


అయితే ఈ థర్డ్ డోస్‌కు అర్హులైన వారు తొలి రెండు డోసులు ఏ వ్యాక్సినైతే తీసుకున్నారో.. ఇప్పుడు కూడా అదే టీకా తీసుకోవాల‌ని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో మిక్స్‌డ్ వ్యాక్సినేషన్‌కు తీసుకోవడానికి లేదని స్పష్టం చేసింది. కానీ రెండు టీకాలు తీసుకున్న 9 నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అర్హులైన వారికి బూస్టర్ డోస్ గురించి మెసేజ్ కూడా పంపినట్లు తెలిపింది. టీకా కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు కొవిన్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర వైద్యారోగ్యశాఖ.

ఐదు రాష్ట్రల్లో ఎన్నికల సిబ్బందికి కూడా టీకా

ఐదు రాష్ట్రల్లో ఎన్నికల సిబ్బందికి కూడా టీకా

మరో నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరునున్నాయి. ఇక్కడ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకవైపు కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వారికి కూడా నేటి ఇవాల్టినుంచి థ‌ర్డ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తుంది.

 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు..

బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు సంబంధింత వ్యాక్సినేషన్‌ సెంటర్‌లోనే ఉండాలి. ఆ సమయంలో వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా..? లేదా? అని వైద్యులు పరిశీలిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న రోజు మాత్రం మాంసం తినకూడదు. మద్యం సేవించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

English summary
corona virus booster dose begins to Seinors, frontline, healthcycare workers in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X