వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో 20 వేల దిగువనే కరోనా కేసులు.. తాజాగా 18,870 కొత్త కేసులు, 378 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో వరుసగా రెండవ రోజు కూడా 20 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 18,870 కొత్త కేసులను నివేదించింది. ఇది నిన్నటి గణాంకాల (18,795) కంటే స్వల్పంగా ఎక్కువ. అయినప్పటికీ మొత్తంగా చూస్తే భారతదేశంలో కరోనా కేసులు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో దేశం 378 మరణాలను నివేదించింది. ఇక మృతుల సంఖ్యలో పెరుగుదల బాగా కనిపిస్తుంది.

 గత 24 గంటల్లో 18,870 మందికి కరోనా పాజిటివ్

గత 24 గంటల్లో 18,870 మందికి కరోనా పాజిటివ్

గత 24 గంటల వ్యవధిలో 15,04,713 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18,870 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.84 శాతం ఉన్నాయి,జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.83 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కోవిడ్-19 కేస్‌లోడ్‌లో 9,686 కేసులు తగ్గాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,82,520 గా ఉంది .మొత్తం కేసులు 3.37 కోట్లకు చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 3.29 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 28,178 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 4.47 లక్షల మంది మరణించారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.25 శాతం, కేరళలోనే ఎక్కువ

రోజువారీ పాజిటివిటీ రేటు 1.25 శాతం, కేరళలోనే ఎక్కువ

రోజువారీ పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య - గత 30 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదు అవుతుంది, ఇది ప్రస్తుతం 1.25 శాతంగా ఉంది. 18 వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులలో, 11,196 ఒక్క కేరళ రాష్ట్రం నుండి మాత్రమే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రం రోజువారీ అధిక కేస్‌లోడ్‌ని నివేదిస్తూనే ఉంది. అయితే ఈ సంఖ్యలు ఇంతకుముందు 20,000 సంఖ్య నుండి తగ్గాయి. కేరళ రాష్ట్రంలో మరణాలు నిన్న 149 కి పెరిగాయి.

మహారాష్ట్రలో తాజా పరిస్థితి ఇదే

మహారాష్ట్రలో తాజా పరిస్థితి ఇదే

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావిత రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,844 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 60 మరణాలు నమోదైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 1,630 కేసులతో, రోజువారీ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడులో నిన్న ఒక్కరోజే 19 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, బీహార్ - మూడు పెద్ద రాష్ట్రాలు - సున్నా కోవిడ్ మరణాలు నివేదించాయి. చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ కూడా సున్నా కోవిడ్ మరణాలను గత కొద్ది రోజులుగా నివేదిస్తూ ఉంది.

1,380 కేసులతో, మిజోరామ్.. పెరుగుతున్న కేసులతో ఆందోళన

1,380 కేసులతో, మిజోరామ్.. పెరుగుతున్న కేసులతో ఆందోళన

అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 16 కొత్త కేసులు మరియు ఒక కోవిడ్ మరణం నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 34 కేసులు, 2 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. తీరప్రాంతమైన గోవా, పర్యాటకుల కారణంగా 90 కరోనా కొత్త కేసులను, ఐదు కోవిడ్ మరణాలను నివేదించింది.1,380 కేసులతో, మిజోరామ్ ఈశాన్య రాష్ట్రాలలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులలో ముందంజలో ఉంది. మిజోరాం రాష్ట్రం కూడా నాలుగు కోవిడ్ మరణాలను నివేదించింది. దాని తరువాత అస్సాం ఉంది. అస్సాం రాష్ట్రంలో 390 కేసులు మరియు 10 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి

Recommended Video

Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
దేశంలో నోవావాక్స్ ట్రయల్ కోసం పిల్లల నమోదుకు లభించిన అనుమతి

దేశంలో నోవావాక్స్ ట్రయల్ కోసం పిల్లల నమోదుకు లభించిన అనుమతి

యుఎస్ ఫార్మా తయారీదారు నోవావాక్స్ యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్ ట్రయల్ కోసం టీకా తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ 7-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలను నమోదు చేయడానికి దేశ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటికే తన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవోవాక్స్, 12-17 ఏజ్ గ్రూపులో నోవావాక్స్ షాట్ యొక్క దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ట్రయల్ నిర్వహిస్తోంది. ప్రారంభ 100 మంది పాల్గొనేవారికి సంబంధించిన భద్రతా డేటాను అందించింది. మరోపక్క రానున్న పండుగ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది.

English summary
For the second day in a row, India recorded less than 20,000 corona cases. In the last 24 hours, India reported 18,870 new cases and 378 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X