భారత్ లో కరోనా కల్లోలం .. కేరళలో ఉప్పెనలా ; గత 24 గంటల్లో 44,658 కొత్త కేసులు, 496 మరణాలు !! భారతదేశంలో కరో

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కసారిగా పెరిగిన కేసులు ఈ రోజు కాస్త క్షీణించి నట్లుగా కనిపిస్తుంది. అయినప్పటికీ నలభై నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 44,658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గత 24 గంటల వ్యవధిలో 496 కరోనా బారినపడిన వారు మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కరోనా కేసుల్లో మూడు శాతం క్షీణత కనిపించింది. తాజాగా 18,24 ,931 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 3.26 కోట్లకు చేరుకోగా, ఇప్పటి వరకు మొత్తం 4, 36,861 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో 30,077 కేసుల నమోదు ... ఇండియాకు టెన్షన్

కేరళలో 30,077 కేసుల నమోదు ... ఇండియాకు టెన్షన్


కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కేరళ 30,077 కేసులను నమోదు చేసింది.కరోనా మహమ్మారి తో రాష్ట్రంలో ప్రభావితమైన వారి సంఖ్య మొత్తం 39,13,506 కి చేరుకుంది. దక్షిణాది రాష్ట్రం కేరళ దేశంలో అత్యధిక సంఖ్యలో రోజువారి కరోనావైరస్ కేసులను నివేదిస్తోంది. జాతీయ అత్యధిక సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. కేరళలో అధిక పాజిటివిటీ నిష్పత్తి (19.3%) ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని దాదాపు 90 శాతం పాజిటివ్ కేసులు స్వల్పంగా మరియు లక్షణరహితంగా ఉన్నట్లు కేరళ కోవిడ్ నిపుణుల అభిప్రాయం. అందువల్ల, చాలా కేసులు గృహ నిర్బంధంలో ఉన్నాయని చెప్తున్నారు.

టాప్ 5లో కేరళ తర్వాత ఉన్న రాష్ట్రాలివే

టాప్ 5లో కేరళ తర్వాత ఉన్న రాష్ట్రాలివే

దేశంలో అత్యధికంగా దెబ్బతిన్న మహారాష్ట్ర గత 24 గంటల్లో 5,108 కరోనా కొత్త కేసులను, 145 మరణాలను నివేదించింది. ఇక మహారాష్ట్ర తర్వాత మూడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. తమిళనాడులో 1559 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 4వ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ 1539 కరోనా కేసులు నమోదు చేసింది. ఇక ఐదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం నిలిచింది కర్ణాటకలో 1213 కరోనా కేసులు నమోదయ్యాయి .
ఢిల్లీలో గురువారం వైరస్ సంబంధిత మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదు, అయితే 45 తాజా కేసులు 0.06 శాతం పాజిటివిటీ రేటుతో నమోదయ్యాయని నగర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ రాజధానిలో మహమ్మారి యొక్క రెండవ తరంగం ప్రారంభమైనప్పటి నుండి ఇది ఒక రోజులో సున్నా మరణాలు నమోదు చెయ్యటం పదహారవసారి.

61 కోట్ల మంది లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్

61 కోట్ల మంది లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్

గత 28 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉంది . ప్రస్తుతం 2.10 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.06% గా ఉంది, మార్చి 2020 తర్వాత అతి తక్కువ, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.60 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 61 కోట్ల మంది లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను అందించారు. దాదాపు 68 లక్షల (67,87,305) వ్యాక్సిన్ డోసులు గురువారం నిర్వహించబడ్డాయి . జనవరి 16 న ప్రారంభమైన టీకా డ్రైవ్ యొక్క 223 వ రోజు కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ట్విట్టర్‌లో అర్హులైన జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదుతో టీకాలు వేశారని తెలియజేశారు.

 భారత్ వ్యాక్సినేషన్ లో అపూర్వ మైలురాయి సాధించిందన్న ఆరోగ్య మంత్రి

భారత్ వ్యాక్సినేషన్ లో అపూర్వ మైలురాయి సాధించిందన్న ఆరోగ్య మంత్రి

భారతదేశం అపూర్వమైన మైలురాయిని సాధించిందని ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన జనాభాలో 50 శాతం మంది కోవిడ్ 19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదుతో టీకాలు వేయబడ్డారని ఆయన తెలిపారు. అలాగే దీనిని కొనసాగించాలని కూడా పేర్కొన్నారు. మనం కరోనాపై పోరాడదాం అంటూ ఆయన ట్వీట్ చేశారు.కోవిషీల్డ్ కోసం 84 రోజుల డోస్ గ్యాప్‌ను తగ్గించే యోచన లేదని ప్రభుత్వ అత్యున్నత నిపుణుడు ఎన్‌కె అరోరా చెప్పారు. ఆరోగ్య నిపుణుల సిఫారసు తరువాత ఈ సంవత్సరం రెండు షాట్ల మధ్య విరామం మూడవసారి సమీక్షించబడుతుందని వచ్చిన వార్తల నేపథ్యంలో అరోరా ఈ వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India | Oneindia Telugu
     ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మార్కును దాటిన కరోనా కేసులు

    ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మార్కును దాటిన కరోనా కేసులు

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 200 మిలియన్ మార్కును అధిగమించాయి. ప్రపంచ దేశాలలో మూడింట ఒక వంతు దేశాలలో కేసులు పెరుగుతున్నాయి, వాటిలో చాలా వరకు తమ జనాభాలో సగం మందికి మొదటి మోతాదు కూడా ఇవ్వలేదు. ఏదిఏమైనా కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పదే పదే నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+