వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు భారీ ఊరట .. 91 రోజుల కనిష్టానికి కరోనా కేసులు, తగ్గిన మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నేడు తొంభై ఒక్క రోజుల కనిష్టానికి కరోనా కేసులు నమోదు కావడం ప్రజలకు కాస్త ఊరటనిస్తోంది. భారతదేశం మంగళవారం 24 గంటల్లో 42,640 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. 91 రోజుల్లో తొలిసారిగా దేశంలో రోజువారీ 50,000 కేసులకు తక్కువగా నమోదయ్యాయి.

24 గంటల్లో 1,167 కరోనా మరణాలు

24 గంటల్లో 1,167 కరోనా మరణాలు

గత 24 గంటల్లో గరిష్టంగా 7,449 కేసులతో కేరళ, 7,427 కేసులతో తమిళనాడు, 6,270 కేసులతో మహారాష్ట్ర, 4,867 కేసులతో కర్ణాటక, 3,031 కేసులతో ఒడిశా ఉన్నాయి. తాజా కేసులలో దాదాపు 70 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుండి నమోదు కాగా, కేరళ నుండి మాత్రమే 17.47 శాతం ఉన్నాయి. భారతదేశం మంగళవారం 24 గంటల్లో 1,167 కోవిడ్ మరణాలను నివేదించింది. మహారాష్ట్రలో గరిష్టంగా 352 మంది మరణించగా, తమిళనాడులో 189 మంది మరణించారు.

 బాగా పెరిగిన రికవరీలు

బాగా పెరిగిన రికవరీలు

దేశంలో రోజువారీ రికవరీలు వరుసగా 40 వ రోజు కేసులలో రోజువారీ నమోదైన కేసులు కంటే కంటే ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 81,839 మంది రోగులు కోలుకోవడంతో, భారతదేశం యొక్క మొత్తం రికవరీలు ఇప్పుడు 2,89,26,038 వద్ద ఉన్నాయి. రికవరీ రేటు 96.49 శాతానికి పెరిగింది.భారతదేశంలో యాక్టివ్ కేసులు కూడా 40,366 కేసులు తగ్గి 6,62,521 కు చేరుకుంది. ఈ సంఖ్య 79 రోజుల తరువాత 7 లక్షల కన్నా తక్కువగా నమోదు కావడం విశేషం.

 సోమవారం ఒకే రోజులో 86.16 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

సోమవారం ఒకే రోజులో 86.16 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

దేశంలో వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా 3.21 శాతంగా ఉంది . రోజువారీ పాజిటివిటీ రేటు 2.56 శాతంగా ఉంది. ఇది వరుసగా 15 రోజులుగా 5 శాతం కన్నా తక్కువ నమోదు అవుతూ వస్తోంది
గత 24 గంటల్లో మొత్తం 16,64,360 నమూనాలను పరీక్షించారు. అదనంగా, భారతదేశం సోమవారం ఒకే రోజులో 86.16 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక సింగిల్ డే టీకా సంఖ్య ఇది అని అధికారిక డేటా వెల్లడిస్తోంది.

నిన్నటి నుండి అందరికీ కేంద్రం కొత్త టీకా విధానం

నిన్నటి నుండి అందరికీ కేంద్రం కొత్త టీకా విధానం

భారతదేశంలో ఇప్పటివరకు అందించిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 28.87 కోట్లు. కేంద్ర ప్రభుత్వం యొక్క కొత్త టీకా విధానం సోమవారం నుండి అమల్లోకి వచ్చింది, దీని ప్రకారం అందరూ ప్రభుత్వ కేంద్రాలలో ఉచిత కోవిడ్ టీకా వేయించుకోవడానికి అర్హులు.దీంతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది.

English summary
India reported 42,640 new Covid-19 cases in 24 hours on Tuesday. For the first time in 91 days, the country has recorded less than 50,000 daily cases.The active caseload in India has declined by 40,366 cases to 6,62,521. This figure is less than 7 lakh after 79 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X