వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Cases In India: కేరళలో నో కంట్రోల్ .. భారత్ లో టాప్ 5 రాష్ట్రాలు, తాజా పరిస్థితి ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసులు 40 వేలకు పైనే నమోదవుతున్నాయి. భారతదేశం గురువారం 42,982 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. ఇది దేశంలోని మొత్తం కరోనా కేసులను 32 మిలియన్లకు చేర్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. ఈరోజు నమోదైన కేసుల సంఖ్య, బుధవారం నమోదైన కేసుల కంటే 300 కేసులు ఎక్కువ. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా దేశంలో 533 కొత్త మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం మరణాలు 4,26,290 కి చేరాయి.

కరోనా థర్డ్ వేవ్ ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనంకరోనా థర్డ్ వేవ్ ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనం

 పెరుగుతున్న యాక్టివ్ కేసులతో కొత్త ఆందోళన

పెరుగుతున్న యాక్టివ్ కేసులతో కొత్త ఆందోళన

తాజా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి అన్న ఆందోళనల మధ్య వరుసగా రెండవ రోజు, భారతదేశంలో 40,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసులు 700 కి పైగా పెరిగి 4,11,076 కి చేరాయి. ఇది ఇప్పటివరకు దేశంలో చూసిన మొత్తం కేసుల్లో 1.29% గా ఉంది. గత 24 గంటల్లో 41,726 మంది రోగులు కోలుకోవడంతో, దేశంలో జాతీయ రికవరీ రేటు 97.3 శాతానికి చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 30,974,748 గా నమోదయింది. భారతదేశం ఇప్పటివరకు 48.93 కోట్ల కోవిడ్ -19 మోతాదులను నిర్వహించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 దేశంలో కరోనా కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలివే

దేశంలో కరోనా కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలివే

వివిధ రాష్ట్రాలలో గత 24 గంటల్లో రోజువారి నమోదైన కేసుల వివరాలను చూస్తే అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 22,414 కేసులు నమోదయ్యాయి. ఆతర్వాత మహారాష్ట్రలో 6126 కేసులు నమోదయ్యాయి .తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,442 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 1,949 కేసులు కర్ణాటక రాష్ట్రంలో 1,769 కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక లు కరోనా కేసుల నమోదు లో టాప్ ఫైవ్ లో ఉన్నాయి.

 కేరళ కరోనా థర్డ్ వేవ్ భయం ..అలెర్ట్ చేస్తున్న కేంద్రం

కేరళ కరోనా థర్డ్ వేవ్ భయం ..అలెర్ట్ చేస్తున్న కేంద్రం

కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తుంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య రోజువారి కోలుకున్న వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసులు పెరగటం కేరళ రాష్ట్రాన్ని కరోనా డేంజర్ జోన్ లోకి నెట్టేసింది. కేరళ లో కరోనా కట్టడికి కేంద్రం పంపించిన నిపుణుల బృందం కరోనా వ్యాప్తి కారకాలను గుర్తించి, కట్టడికి తగిన సూచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. కేరళలో కేసులు పెరుగుతున్న తీరు మూడవ వేవ్ కు సంకేతంగా నిపుణుల బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ సర్కార్ మరింత అప్రమత్తంగా వ్యవహరించారని కేంద్రం వారికి సూచనలు చేస్తుంది.

ఆగస్ట్ లోనే కరోనా థర్డ్ వేవ్ .. అయినా తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా

ఆగస్ట్ లోనే కరోనా థర్డ్ వేవ్ .. అయినా తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా

ఒక అధ్యయనం ప్రకారం, ఆగస్టులో భారతదేశం కోవిడ్ -19 కేసులలో మరొక పెరుగుదలను చూసే అవకాశం ఉంది, కానీ రెండవ తరంగం వలె తీవ్రంగా ఉండకపోవచ్చు అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మరియు కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పరిశోధకులు మతుకుమల్లి విద్యాసాగర్ మరియు మణింద్ర అగర్వాల్ వరుసగా కోవిడ్ -19 కేసుల పెరుగుదల కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ తరంగానికి దారితీస్తుందని అంచనా వేశారు. అక్టోబర్‌లో ఈ తరంగం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 దక్షినాది రాష్ట్రాలే కాదు అక్కడ కూడా పెరుగుతున్న కేసులు

దక్షినాది రాష్ట్రాలే కాదు అక్కడ కూడా పెరుగుతున్న కేసులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ -19 కేసుల పెరుగుదల మూడవ తరంగ పెరుగుదలను సూచిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉంటే రోజువారీ కేసుల సంఖ్య లక్ష నుండి లక్షా యాభై వేల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లక్ష్వాద్వీప్, తమిళనాడు, మిజోరాం, కర్ణాటక, పుదుచ్చేరి మరియు కేరళ వంటి రాష్ట్రాల ద్వారా భారతదేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్న కేసుల ధోరణిని నివేదించింది . ఈ రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేకమైన దృష్టి సారించి కరోనా కట్టడికి మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

Recommended Video

India 21/0 at stumps after England 183 all out | Oneinddia telugu
డెల్టా వేరియంట్ తోనే భయం .. వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు

డెల్టా వేరియంట్ తోనే భయం .. వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు

కోవిడ్ -19 యొక్క అత్యంత ప్రసారమయ్యే డెల్టా వేరియంట్ వ్యాప్తి ఒక ప్రధాన సమస్య అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. మహమ్మారి ఇంకా ఉధృతంగా కొనసాగుతుందని కొన్ని రాష్ట్రాలు ఆర్ కారకాన్ని పెంచుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందని దానిని కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని కేంద్రం కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను ఆదేశిస్తుం

English summary
The state of Kerala recorded the highest number of 22,414 cases in the last 24 hours. Maharashtra was next with 6126 cases .Andhra Pradesh came next with 2,442 cases in the last 24 hours. Then there were 1,949 cases in Tamil Nadu and 1,769 in Karnataka. The southern states of Kerala, Maharashtra, Andhra Pradesh, Tamil Nadu and Karnataka are in the top five in registering corona cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X