మళ్లీ వచ్చేసింది..దేశంలో మరోసారి కరోనా కలకలం ..పెరుగుతున్న మృతుల సంఖ్య

భారతదేశంలో కోవిడ్-19 మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం రేపుతోంది.

ముంబైలో విషాదం:
ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. అయితే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మాత్రం వీరి మరణాలకు కరోనా ప్రాథమిక కారణం కాదని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ, కరోనా పాజిటివ్ గా ఉన్న సమయంలో మరణించడం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

Corona cases in the country two deaths

దేశవ్యాప్తంగా 260 కేసులు:
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది.

జాగ్రత్తలు తప్పనిసరి:
కరోనా లక్షణాలు (జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, రుచి/వాసన కోల్పోవడం వంటివి) కనిపిస్తే తక్షణం స్వీయ జాగ్రత్తలు పాటించాలని, వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే,బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం వంటివి తిరిగి అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+