వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు .. గత 24 గంటల్లో 18,855 కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గత 24 గంటల్లో18,855 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో కేసు లోడు ఒక్కసారిగా పెరిగింది . ఇక ఇప్పటి వరకు భారతదేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తంగా చూస్తే 1, 07,20,048 గా నమోదయింది. భారతదేశపు తాజా రోజువారీ కరోనావైరస్ కేస్ లోడు మొన్నటి వరకు గణనీయంగా తగ్గింది. మళ్లీ ఒక్కసారిగా గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది . దీంతో మరోమారు ఆందోళన నెలకొంది .

ఏపీ, తెలంగాణాల్లో భిన్నమైన కరోనా వైరస్ ఎన్ 440కే .. సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడిఏపీ, తెలంగాణాల్లో భిన్నమైన కరోనా వైరస్ ఎన్ 440కే .. సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడి

24 గంటల్లో18,855 కొత్త కేసులు.. మొన్నటితో పోలిస్తే 61 శాతం పెరిగిన రోజువారీ కేసులు

24 గంటల్లో18,855 కొత్త కేసులు.. మొన్నటితో పోలిస్తే 61 శాతం పెరిగిన రోజువారీ కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మొన్న భారతదేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు 11,666 నమోదు కాగా మునుపటి కంటే 7,200 అదనపు కేసు లోడ్ తో నిన్న ఒక్కరోజే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి .

నిన్న ఒక్కరోజే భారీగా కేసులు పెరిగాయి. మొన్నటితో పోలిస్తే ఒక్కసారిగా 61 శాతం కేసులు పెరిగాయి . ఇప్పటి వరకు ఇండియాలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 10.4 మిలియన్లకు చేరుకుంది . 20,746 కొత్త డిశ్చార్జెస్ తో మొత్తం కోలుకున్న కేసులను 1,03,94,352 గా మంత్రిత్వ శాఖ పేర్కొంది .

 మొత్తం మరణాల సంఖ్య 154,010, క్రియాశీల కేసులు 1,71,686

మొత్తం మరణాల సంఖ్య 154,010, క్రియాశీల కేసులు 1,71,686

163 తాజా మరణాలతో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 154,010 కు చేరుకోవడంతో మరణాల సంఖ్య 154,000 మార్కును దాటింది. క్రియాశీల కేసులు, అదే సమయంలో, 1, 72,000 కన్నా తక్కువకు పడిపోయాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,71,686 వద్ద ఉన్నాయి. ఇండియాలో మొత్తం కేసులలో రికవరీలు 96.94% గా నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 1.62% ఉన్నాయి. మరణాలు మొత్తం కేసులలో 1.44% ఉన్నాయి.

 కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. ఇప్పటివరకు 29,28,053 మందికి వ్యాక్సిన్

కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. ఇప్పటివరకు 29,28,053 మందికి వ్యాక్సిన్


శుక్రవారం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) జనవరి 28 వరకు కోవిడ్ -19 కోసం 742,306 నమూనాలను పరీక్షించిందని, ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం నమూనాలను 19,50,81,079 కు చేరిందని పేర్కొన్నారు. మరోవైపు జనవరి 16 వ తేదీన ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటివరకూ 29,28,053 మందికి కరోనా వ్యాక్సిన్ లు ఇచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5,72,060 మందికి వ్యాక్సిన్ లు ఇచ్చినట్లుగా సమాచారం.

English summary
India’s latest daily count of cases of the coronavirus disease (Covid-19) witnessed a sharp spike as 18,855 new infections took the country’s tally to 1,07,20,048, the Union health ministry’s dashboard showed on Friday. In its previous daily count, the country had reported 11,666 cases, meaning that the latest spike is nearly 7,200 infections higher than the previous one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X