భారత్ లో షాకిచ్చేలా పెరిగిన కరోనా మరణాలు .. గత 24 గంటల్లో 2,020 మరణాలు, 31,443 కొత్త కేసులు

భారతదేశంలో తాజాగా కరోనా కేసులు 31 వేలకు దిగొచ్చినా, మరణాలు మాత్రం ఊహించని విధంగా భారీగా నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల మధ్య, మధ్యప్రదేశ్ తన అధికారిక డేటాను సవరించి, 1,481 మరణాలను నమోదు చేయడంతో, రోజువారీ కోవిడ్ మరణాలలో భారతదేశం మరోమారు జెట్ స్పీడ్లో దూసుకు వెళ్ళింది.

గత 24 గంటల్లో భారత దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,020 కి చేరుకుంది.కోవిడ్ మరణాల సంఖ్యను బాగా నమోదుచేసిన మహారాష్ట్ర మరియు బీహార్ తరువాత మధ్యప్రదేశ్ మూడవ రాష్ట్రం. దాదాపు రెండు వారాలుగా భారతదేశం ప్రతిరోజూ 1,000 కన్నా తక్కువ మరణాలను నమోదు చేస్తోంది. తాజా కేసుల్లో దేశం రోజువారీ పెరుగుదల నాలుగు నెలల్లో అతి తక్కువగా నమోదయింది. గత 24 గంటల్లో భారతదేశం 31,443 కొత్త కేసులను నమోదు చేసింది. ఇది 118 రోజులలో రోజువారీ కనిష్ట కేసులు నమోదు అని అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Corona deaths on the rise in India: 2,020 deaths, 31,443 new cases in last 24 hours

దేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 4,31,315 వద్ద ఉంది. ఇది 109 రోజుల్లో అతి తక్కువ, మొత్తం కేసులలో 1.4 శాతంగా ఉంది. కోవిడ్ యొక్క మూడవ వేవ్ కు సమయం దగ్గర పడిందని, కచ్చితంగా వచ్చి తీరుతుందని అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. పర్యాటక స్థలాలు, తీర్థయాత్రల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. సెకండ్ వేవ్ కరోనా విజృంభణ లో మే నెలలో 4,500కు పైగా రోజువారీ మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత స్వల్ప హెచ్చుతగ్గులతో క్రమంగా తగ్గుముఖం పట్టిన మరణాలు, గత కొద్ది రోజులుగా వెయ్యి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. జులై 5వ తేదీన అత్యల్పంగా 553 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరణాల లెక్కలు సవరించటంతో ఊహించనివిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1481 మరణాలు నమోదైనట్లు గా అధికారిక డేటా చూపించింది. దీంతో దేశంలో ఒక్కసారిగా 2020 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Recommended Video

    INDIA VS SRILANKA : New Match Timings For T20I And ODI Series | SLC | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+