భారత్ లో క్షీణిస్తున్న కరోనా.. గత 24 గంటల్లో 44,111 కొత్త కేసులు, 738 మరణాలు
భారతదేశంలో కరోనా కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. భారతదేశంలో గత 24 గంటలలో కరోనా కారణంగా 44,111 కొత్త కేసులు నమోదు కాగా, 738 కరోనా మరణాలను నమోదు చేసింది. మరణాలు ఈ రోజు బాగా తగ్గాయి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 30.5 మిలియన్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం మరణాల సంఖ్య 4,01,050 కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి.
భారతదేశం యొక్క యాక్టివ్ కేసులు గత 24 గంటల్లో 14,104కు తగ్గాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,95,533 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కరోనా కేసులు ఈ యాక్టివ్ కేసులు 1.67% గా ఉంది. దేశంలో కరోనా కారణంగా చికిత్స తీసుకుని రికవరీ అయిన వారు 97.01% గా ఉన్నారు. రికవరీలు వరుసగా 51 రోజుల నుండి రోజువారీ కొత్త కేసులను మించి కొనసాగుతున్నాయి. కరోనా రెండవ వేవ్ క్షీణిస్తున్న దశలో, భారతదేశంలో కోవిడ్ -19 కేసులు జూన్ 21 న మొదటిసారి 50,000 కన్నా తక్కువగా నమోదయ్యాయి.

అప్పటి నుండి 30,000-50,000 మధ్యలో కొనసాగుతున్నాయి. మే 6న 4,14,188 కొత్త కేసులతో గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత రెండవ తరంగంలో కోవిడ్ -19 కేసులు దేశంలో ఇప్పుడు బాగా తగ్గాయి. కరోనా కేసులు క్షీణిస్తున్నప్పటికీ కరోనా జాగ్రత్త చర్యలు తీసుకోవడం తగ్గించకూడదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కరోనా థర్డ్ వేవ్ ను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications