వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ పై కరోనా పంజా...ప్రపంచంలో మరణాలలో 8వ స్థానం,24 గంటల్లో 16 వేలకు చేరువలో కేసులు,రికార్డ్ బ్రేక్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదు కావటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది.అయినా లాక్ డౌన్ విషయంలో మాత్రం ఏ విధమైన ఆలోచన చెయ్యకపోవటంగమనార్హం . ఇక తాజాగా భారత దేశ పరిస్థితి ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు పెరుగుతున్న దేశాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది .

భారత్ లో 3.32 లక్షలకు పైగా .. గత 24 గంటల్లో 11,502 కేసులు .. ప్రపంచంలో 80 లక్షలకు చేరువలోభారత్ లో 3.32 లక్షలకు పైగా .. గత 24 గంటల్లో 11,502 కేసులు .. ప్రపంచంలో 80 లక్షలకు చేరువలో

మరణాలలో ఇండియా స్థానం ఇదే

మరణాలలో ఇండియా స్థానం ఇదే

భారతదేశంలో గత కొన్ని రోజులుగా ఏ రోజుకా రోజు రికార్డ్ ను బ్రేక్ చేస్తూ కరోనా కేసులు పెరుగుతున్నాయి . కరోనావైరస్ తో ఇప్పటివరకు 14 వేలమందికి పైగా చనిపోయారు . ఇక ఈ పరిస్థితిని బట్టి , మరణాల సంఖ్యను బట్టి ప్రపంచ మరణాల సంఖ్యలో భారతదేశం ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉందని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. దేశంలో ఇప్పుడు 4.50 లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి . ఇక ఇప్పటివరకు 56.71 శాతం మంది రోగులు కోలుకున్నారు అని అధికారులు తెలిపారు. మొత్తం ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులలో విదేశీయులు కూడా ఉన్నారు.

నియంత్రణా ప్రణాళికలు పాటించినా తగ్గని కేసులు

నియంత్రణా ప్రణాళికలు పాటించినా తగ్గని కేసులు

తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రతిరోజూ 10,000 నుండి 20,000 నమూనాలను పరీక్షించడంతో పరీక్షించే సామర్థ్యాన్ని క్రమంగా పెంచాయి.

పరీక్ష మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ కాకుండా "మరణాల తగ్గింపు" అనేది ప్రభుత్వ కరోనా కంటైనేషన్ ప్లాన్‌లో ప్రాధాన్యతగా మారింది , ఎందుకంటే ఎపిడెమియాలజిస్టులు మరియు నిపుణులు పదేపదే మరణాల సంఖ్య తగ్గించే దిశగా ప్రయత్నం సాగాలని చెప్తున్నారు. అలాగే కేసుల నియంత్రణ ప్రణాళికలు కూడా అవసరం అని పేర్కొన్నారు.

తన డైలీ కేసుల రికార్డ్ ను తానే బ్రేక్ చేస్తున్న ఇండియా

తన డైలీ కేసుల రికార్డ్ ను తానే బ్రేక్ చేస్తున్న ఇండియా

కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కేసులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.గత 24 గంటల్లో అత్యధికంగా 15,968 కేసులు నమోదు అయ్యాయి. ఇదే ఇప్పటివరకు ఒక రోజు అత్యధిక కేసులు పెరిగిన రికార్డ్ . ఇక గత 24 గంటల్లో 465 మంది మరణించారు, భారతదేశకరోనా కేసుల్ లెక్కింపు బుధవారం 4,56,183 కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 14,476 మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కలో 1,83,022 క్రియాశీల కేసులు, మరియు 2,58,685 డిశ్చార్జ్ అయిన రోగులు ఉన్నారు.

ఈ రోజు నమోదైన మరణాలు రాష్ట్రాల వారీగా

ఈ రోజు నమోదైన మరణాలు రాష్ట్రాల వారీగా


బుధవారం ఉదయం వరకు నమోదైన 465 మరణాలలో 248 మహారాష్ట్రలో, 68 ఢిల్లీలో , తమిళనాడులో 39, గుజరాత్లో 26, ఉత్తర ప్రదేశ్లో 19, పశ్చిమ బెంగాల్లో 11, రాజస్థాన్ మరియు హర్యానాలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది మరియు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో మూడు, జమ్మూ కాశ్మీర్‌లో రెండు, ఒడిశా, ఉత్తరాఖండ్.
కేరళ, బీహార్, పుదుచ్చేరిలలో ఒక్కో కరోనా బాధితుల మరణాలు సంభవించాయి .

మహారాష్ట్ర పరిస్థితి దారుణం...టాప్ 5 రాష్ట్రాలు ఇవే

మహారాష్ట్ర పరిస్థితి దారుణం...టాప్ 5 రాష్ట్రాలు ఇవే

ఇక మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది . ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,39,010 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. ఆ తరువాత స్థానంలో ఢిల్లీ చేరింది . ఢిల్లీలో 66,602 కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకు ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా తమిళనాడును క్రాస్ చేసి ఢిల్లీ ఇప్పుడు రెండో స్థానంలోకి చేరింది . ఇక మూడో స్థానంలో ఉన్న తమిళనాడు 64,603 కేసులతో ఉంది . నాల్గవ స్థానంలో గుజరాత్ 28,429 కేసులతో , ఐదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 18,893 కేసులతో ఉంది.

English summary
India has so far recorded 4,56,183 lakh cases, which includes 14,476 deaths. Maharashtra, Tamil Nadu, Delhi and Gujarat have reported the highest number of cases. However, the recovery rate is rising and now stands at 56.7 percent. 465 deaths and 15,968 new Covid-19 cases reported in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X