భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే: తగ్గిన యాక్టివ్ కేసులు; గత 24 గంటల్లో కొత్త కేసులు,మరణాలు ఇలా!!
భారత దేశంలో కరోనా వ్యాప్తికి ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 21,257 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కరోనా కేసులు నిన్నటి సంఖ్య కంటే కేవలం ఐదు శాతం తక్కువ. కరోనావైరస్ కారణంగా దేశం 271 మరణాలను కూడా నివేదించింది. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీల కరోనా కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.71 శాతం గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,40,221కి తగ్గింది. 205 రోజుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఈరోజు అత్యల్పంగా నమోదయింది

దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,32,25,221
జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.96 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కనీసం 24,963 రికవరీలు నమోదు కాగా, భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,32,25,221 కి చేరాయి. ఇదిలా ఉంటే రోజువారీ పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య - 1.53 శాతంగా ఉంది. భారతదేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.64 శాతంగా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 93.17 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. భారతదేశంలో పెద్దలకు 71 శాతం మంది కనీసం ఒక మోతాదు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ లను అందుకున్నారని, 27 శాతం మందికి రెండు డోసులు ఇవ్వబడ్డాయి అని ప్రభుత్వం తెలిపింది.

కేరళలో 12,288 తాజా కోవిడ్-19 కేసులు
కేరళలో 12,288 తాజా కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,18,744 కి చేరుకుంది. గత వారం భారతదేశంలో 56 శాతం కోవిడ్ కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుండేనమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావితమైన మహారాష్ట్ర గత 24 గంటల్లో 2681 కరోనా కేసులు నమోదు కాగా 49 మంది మరణించారు. తమిళనాడు రాష్ట్రంలో 1390 కరోనా కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి మహమ్మారి కారణంగా 27 మంది మృత్యువాత పడ్డారు.

వివిధ రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 643 కరోనా కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 771 కరోనా కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారు. నలుగురు సభ్యుల కేంద్ర బృందం ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో పర్యటిస్తూ కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మిజోరంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం ఫోకస్ చేసింది. గత 24 గంటల్లో మిజోరం రాష్ట్రంలో 1302 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు.

పండుగల సీజన్ .. ఆనందాన్ని పంచుకోండి, వైరస్ ను కాదన్న ప్రభుత్వం
ఐదు రాష్ట్రాలు మిజోరం, కేరళ, సిక్కిం, మణిపూర్ మరియు మేఘాలయ - వీక్లీ పాజిటివిటీ రేటును ఐదు శాతానికి పైగా నివేదిస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 44 కరోనా కేసులు నమోదు కాగా, జీరో మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.07 శాతంగా నమోదైంది. కోవిషీల్డ్ లేదా యుకె ఆమోదించిన ఇతర టీకాలతో వ్యాక్సినేషన్ తీసుకున్న భారతీయులు అక్టోబర్ 11 నుండి బ్రిటన్ వెళ్లినా క్వారంటైన్ విధించబడదని యూపీఏ ప్రభుత్వం వెల్లడించింది . ఇదిలా ఉంటే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, తమని తాము కాపాడుకోవడానికి కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొంది. ప్రజలు ఆనందాన్ని పంచుకోవాలి కానీ వైరస్‌ని కాదని ప్రభుత్వం ప్రజలను కోరింది.












Click it and Unblock the Notifications