ఒక్కసారిగా భారీగా.. గత 24 గంటల్లో 35,178 కరోనా కేసులు, 440 మరణాలు : టాప్ 5 రాష్ట్రాలివే !!

భారతదేశానికి కరోనా మహమ్మారి నుండి రిలీఫ్ దొరికింది అనుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిన్నటికి నిన్న భారీగా కేసులు తగ్గి కాస్త ఊపిరి పీల్చుకుంటే, ఈరోజు ఒక్కసారిగా పెరిగిన కేసులు భారతదేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 35,178 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 440 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. రోజువారీ కొత్త కేసులు మంగళవారం నివేదించిన 25,166 నుండి దాదాపు 40 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 154 రోజుల్లో ఒకరోజులో కేసుల పెరుగుదల ఇంతగా ఎప్పుడూ నమోదు కాలేదు.

 తాజాగా 3,67,415 కరోనా యాక్టివ్ కేసులు

తాజాగా 3,67,415 కరోనా యాక్టివ్ కేసులు

యాక్టివ్ కేసుల విషయానికి వస్తే 3,67,415 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 148 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక కరోనా యాక్టివ్ కేసుల శాతం కూడా మొత్తం కేసులలో 1.14 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 37,169 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 3.15 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.52 శాతంకు చేరుకుంది. వీక్లీ పాజిటివిటీ రేటు - పాజిటివ్ ఫలితాలను అందించే కోవిడ్ పరీక్షల శాతం - 1.95 శాతంగా ఉంది.

56.1 కోట్లకు చేరుకున్న వ్యాక్సినేషన్

56.1 కోట్లకు చేరుకున్న వ్యాక్సినేషన్

గత 54 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువ అంటే ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది. రోజువారీ రేటు 1.96 శాతం మరియు ఇది 23 రోజులుగా మూడు శాతం కంటే తక్కువగా ఉంది. గత 24 గంటల్లో దాదాపు 55 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 56.1 కోట్లకు చేరుకుంది. ఏడు రోజుల సగటు టీకా మోతాదు 43 లక్షలకు పైగా పెరిగింది. ఇది జూన్ చివరి నుండి అత్యధికం, ఇది దాదాపు 45 లక్షల మోతాదులుగా ఉంది.

 కరోనా హాట్ స్పాట్ గా కేరళ .. టాప్ 5 రాష్ట్రాలివే

కరోనా హాట్ స్పాట్ గా కేరళ .. టాప్ 5 రాష్ట్రాలివే

ప్రస్తుత రేటు ప్రకారం భారతదేశంలో వయోజన జనాభాలో కేవలం 36 శాతం మంది మాత్రమే ఈ సంవత్సరం చివరినాటికి పూర్తిగా టీకాలు వేయబడతారు. కేరళ భారతదేశంలో కరోనా హాట్ స్పాట్ గా కొనసాగుతోంది. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో 21,613 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రంలో యాక్టివ్ కేస్‌లోడ్ 1.75 లక్షలకు పైగా పెరిగింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తాజాగా 4,408 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో 1804 కరోనా కేసులు ఆ తర్వాతి స్థానంలో కర్ణాటకలో 1,298 కరోనా కేసులు, ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో 1,063 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Two people had tied themselves to US C-17 aircraft fell down | Oneindia Telugu
    యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

    యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

    ఢిల్లీలో తాజాగా 38 కరోనా కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి . పాజిటివిటీ రేటు 0.07 శాతంగా ఉంది . కర్ఫ్యూ సమయాలు సడలించబడ్డాయి . అస్సాంలో గత 24 గంటల్లో 741 కొత్త కేసులు మరియు 11 మరణాలు నమోదయ్యాయి. మూడవ వేవ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల మధ్య, కేంద్రం యాంటిజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఎగుమతిదారులు నిషేధిత కేటగిరీ కింద వస్తువులను రవాణా చేయడానికి డీజీఎఫ్టీ నుండి లైసెన్స్ లేదా అనుమతి తీసుకోవాలి. ఇటువంటి ఆంక్షలు కిట్ల యొక్క దేశీయ లభ్యతను పెంచే లక్ష్యంతో కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని, మాస్క్ లను ధరించాలని పదే పదే హెచ్చరిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+