భారత్ లో కరోనా : మళ్ళీ పెరిగిన కొత్త కేసులు; కేరళలోనే సగానికి పైగా.. తాజా పరిస్థితి ఇదే !!
భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి బయటపడ్డామని భావించినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 27,176 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 3,33,16,755 కి చేరుకుంది.

తగ్గిన యాక్టివ్ కేసులు .. 3,51,087 కేసులు, మరణాలలోనూ తగ్గుదల
యాక్టివ్ కేసులు 3,51,087 కి తగ్గాయి. యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1.05 శాతంగా ఉన్నాయి. బుధవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 284 తాజా మరణాలతో మరణాల సంఖ్య 4,43,497 కు పెరిగింది.జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.62 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 38,012 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.51 లక్షల మంది యాక్టివ్ కేసులు కరోనా మహమ్మారి కారణంగా చికిత్స పొందుతున్నారు.

కేరళలోనే సగానికి పైగా రోజువారీ కేసులు
క్రితం రోజుతో పోలిస్తే రోజువారీ కేసుల్లో ఏడు శాతం పెరుగుదల కనిపించింది. అయినప్పటికీ వరుసగా నాలుగో రోజు దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల దిగువనే నమోదయింది. ఇక గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులను నమోదు చేసింది. కేరళ రాష్ట్రంలో 15,876 మంది కరోనా బారిన పడగా, ప్రస్తుత నమోదవుతున్న రోజు వారి కేసులలో సగానికి పైగా కేసులు కేరళ నుండి నమోదు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మహారాష్ట్ర గత 24 గంటల్లో 3530 కరుణ వైరస్ కేసులను నమోదు చేసింది.

కరోనా మొదలైనప్పటి నుండి కేసులపెరుగుదల క్రమం ఇదే
ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలిదశలో కోవిడ్ -19 సంఖ్య 2020 ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు మరియు సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28 న 60 లక్షలు, అక్టోబర్ 11 న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు దాటింది మరియు డిసెంబర్ 19 న ఒక కోటి మార్కును అధిగమించింది. ఇక ఆ తర్వాత ఈ ఏడాది విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ లో మే 4 న భారతదేశం రెండు కోట్ల భయంకరమైన మైలురాయిని దాటింది . జూన్ 23 న మూడు కోట్లు దాటింది.
Recommended Video

కరోనా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు .. అయినా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వచ్చే ఏడాది కూడా మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో కనీసం ఒక మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్ అందుకున్న వారి సంఖ్య, దేశంలో టీకా షెడ్యూల్ పూర్తి చేసిన వారి సంఖ్య కూడా ప్రపంచంలోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications