భారత్ లో తొలి కరోనా సోకిన కేరళకు చెందిన విద్యార్థినికి మళ్ళీ కరోనా పాజిటివ్
ఇండియాలో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ కరోనా వైరస్ బారిన పడ్డారు. గతేడాది భారతదేశంలో కరోనా మహమ్మారి తొలి కేసుగా నమోదైన తొలి భారతీయురాలైన చైనాలోని వూహాన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళ త్రిస్సూర్‌కు చెందిన ఒక విద్యార్థినికి ఇప్పుడు మరో మారు వ్యాధి సోకినట్లు ఆరోగ్య అధికారి తెలిపారు . అయినప్పటికీ, ఆమె ఎలాంటి లక్షణాలు లేకుండా కోవిడ్ బారిన పడ్డట్టుగా వెల్లడించారు.

ఢిల్లీ వెళ్దామని పరీక్షలు చేయించిన విద్యార్థినికి కరోనా పాజిటివ్
ఢిల్లీకి వెళ్దాం అనుకున్న విద్యార్థిని మరోసారి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆమె కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట యాంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్టిపిసిఆర్ లో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారించబడలేదు అని త్రిస్సూర్ జిల్లా వైద్య అధికారి కె జె రీనా అన్నారు.

రీ ఇన్ఫెక్షన్ కొత్త కాదన్న వైద్యులు
ఉన్నత చదువుల నిమిత్తం ఆమె ఢిల్లీ వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకో గా ఆమెకు కరోనా పాజిటివ్ గా వచ్చినట్లుగా వెల్లడించారు. రీ ఇన్ఫెక్షన్ కొత్తేమీ కాదని, కొంతమంది ఆరోగ్య కార్యకర్తలకు కూడా రెండుసార్లు సోకినట్లు ఆమె తెలిపారు.మహమ్మారి కారణంగా బీజింగ్ ఇంకా పలు దేశాలు భారతీయ విద్యార్థులను తిరిగి దేశంలోకి అనుమతించకపోవడంతో చైనాకు తిరిగి వెళ్ళలేకపోయిన ఈ విద్యార్థిని 2020 లో కోవిడ్ -19 చికిత్స పొందుతూ దాదాపు ఒక నెల ఆసుపత్రిలో ఉన్నారు.

చైనా నుండి ఇండియాకి కరోనా ను తీసుకొచ్చిన తొలి విద్యార్థిని .. అప్పుడు నెల రోజులు చికిత్స
చైనాలోని మహమ్మారి కేంద్రంగా ఉన్న వుహాన్ నుండి ఆమెతో కలిసి, ఆమె ఇద్దరు స్నేహితులు ఇండియాకు వచ్చారు . తర్వాత వారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విద్యార్థినికి 2020 జనవరి నెలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భారతదేశంలోనే తొలి కేసు నమోదు చేసిన విద్యార్థి ఈమె. ఆమెకు ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు మరియు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కలుసుకున్న ఇతరులపై ప్రధానంగా ఆందోళన చెందారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఆమె జనవరి 27 నుండి ఫిబ్రవరి 20 వరకు ఐసోలేషన్ వార్డులో 24 రోజులు ఉన్నారు . ఇక మరోమారు కరోనా సోకిన దేశంలోనే తొలి కరోనా పేషెంట్ ప్రస్తుతం వారు ఇంట్లోనే ఉన్నారని ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications