వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభమేళాలో కరోనా విలయం .. 30 మంది నాగ సాధువులకు కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న మెగా కుంభమేళా కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది నాగ సాధువులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇందులో రిషికేశ్‌లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరిన అఖిల భారత అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్ర గిరి ఉన్నారు. సాధువులు , కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు కరోనా మహమ్మారి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది . కుంభమేళా నిర్వహణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

మహమ్మారి బారిన పడిన 30 మంది నాగ సాధువులు

మహమ్మారి బారిన పడిన 30 మంది నాగ సాధువులు

కుంభ మేళాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు 30 మంది నాగ సాధువులు మహమ్మారి బారిన పడ్డారు . ఈ కుంభమేళాలో పాల్గొన్న మరో ప్రముఖ సాధు - మహా నిర్వాణి అఖాడా నాయకుడిగా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి కపిల్ దేవ్ డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా మహమ్మారి కి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన రిషికేశ్ లోని ఓ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించబడ్డారు.

కరోనా కారణంగా కుంభమేళా ముగిస్తున్నట్టు ప్రకటించిన నిరంజని అఖాడా

కరోనా కారణంగా కుంభమేళా ముగిస్తున్నట్టు ప్రకటించిన నిరంజని అఖాడా

కుంభమేళ వద్ద 13 కంటే ఎక్కువ మత సమూహాలలో రెండవ అతిపెద్ద నిరంజని అఖాడా, షెడ్యూల్ ముగియడానికి దాదాపు రెండు వారాల ముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నాడు తమ కార్యక్రమాలను ముగించనున్నట్లు పేర్కొంది. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు, 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . కరోనా మహమ్మారి కారణంగా క్షీణిస్తున్న పరిస్థితుల దృష్ట్యా, కుంభమేళా మన కోసం ముగిస్తున్నారు. ప్రధాన 'షాహి స్నాన్' ('రాయల్ బాత్') ముగిసింది .

ఏప్రిల్ 10 నుండి 15 వరకు మొదటి ఐదు రోజులలో 2,167 మందికి కరోనా

ఏప్రిల్ 10 నుండి 15 వరకు మొదటి ఐదు రోజులలో 2,167 మందికి కరోనా


మా అఖాడా నుండి చాలా మంది కరోనావైరస్ మహమ్మారి బారిన పడ్డారు అని రవీంద్ర నిరంజని అఖాడా కార్యదర్శి పేర్కొన్నారు

. ఏప్రిల్ 10 నుండి 15 వరకు మొదటి ఐదు రోజులలో కుంభ మేళా ప్రాంతానికి చెందిన 2,167 మంది కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్లు గురువారం రాత్రి వచ్చిన నివేదిక పేర్కొంది.
తదుపరి ముఖ్యమైన కుంభమేళా జరిగే రోజు ఏప్రిల్ 27. సాధువులు , ప్రజలు కరోనా బారిన పడటంతో పరిస్థితి దారుణంగా మారింది .

 కుంభమేళా నిర్వహించడం పై విమర్శలు .. సమర్ధించిన సీఎం

కుంభమేళా నిర్వహించడం పై విమర్శలు .. సమర్ధించిన సీఎం

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ హరిద్వార్ మెగా కుంభమేళా నిర్వహించడం పై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కుంభమేళ నిర్వహించడాన్ని సమర్థించారు, ఫేస్ మాస్క్‌ల వాడకం మరియు సామాజిక దూరం వంటి మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు.

English summary
30 sadhus participating in the mega Kumbh Mela at Uttarakhand's Haridwar have tested positive for COVID-19, including Mahant Narendra Giri, the leader of the All India Akhada Parishad, who has been admitted to the AIIMS (All India Institute of Medical Sciences) in Rishikesh.Another prominent sadhu - Swami Kapil Dev from Madhya Pradesh, who was the leader of the Maha Nirvani Akhada, died while being treated for a coronavirus infection at a private hospital in Dehradun; he had been transferred from a facility in Rishikesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X