వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వణికిస్తున్న కరోనా .. 90 వేలకు చేరువగా కొత్త కేసులు , 714 మరణాలు, టెన్షన్ లో సర్కార్ !!

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా రక్కసి ఊహించని విధంగా పెరిగిపోతోంది ఏప్రిల్ రెండో వారంలో కరోనా పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు . పెరుగుతున్న కోవిడ్ కేసుల ఆందోళన తీవ్రత మధ్య గత 24 గంటల్లో భారత్ 89,129 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి . 92,605 కేసులు నమోదైన సెప్టెంబరు 20 తర్వాత నేడు నమోదైన కేసులు రోజువారీ కేసుల్లో అత్యధికం.

కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలుకరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలు

భారతదేశంలో గత 24 గంటల్లో 89,129 కొత్త కేసులు , 714 మరణాలు

భారతదేశంలో గత 24 గంటల్లో 89,129 కొత్త కేసులు , 714 మరణాలు

భారతదేశం 89,129 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేయడంతో, ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1, 23,92,260 కు చేరుకుంది. ఇందులో 44,213 క్రియాశీల కేసులు, 44,202 రికవరీలు మరియు 714 మరణాలు ఉన్నాయి. మరణాల సంఖ్య 1, 64,110 కు పెరిగింది.

విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తుంది. నిన్న అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరి కరోనా నియంత్రణ చర్యలపై పలు సూచనలు చేసింది.

కరోనా ఉగ్రరూపం దాల్చిన రాష్ట్రాలివే

కరోనా ఉగ్రరూపం దాల్చిన రాష్ట్రాలివే

మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్ గడ్, చండీ గడ్ , గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానాలో పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్రం శుక్రవారం సమీక్షా సమావేశం అనంతరం తెలిపింది. దేశంలో 90 శాతం కేసులు మరియు మరణాలు ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదవుతున్నాయని పేర్కొంది.

భారతదేశంలో అత్యధికంగా కరోనా రక్కసి చేతిలో చిక్కి విలవిల లాడుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కోవిడ్-19 నుండి ఇప్పటివరకు తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలో నిన్న 47,827 కొత్త కేసులు నమోదయ్యాయి .

 మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా


2020 మార్చిలో భారతదేశంలో మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు గత 24 గంటల్లో నమోదైన కేసులే రోజువారీ కేసుల్లో అత్యధికం . గత 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తో 202 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ముంబైలో 24 గంటల వ్యవధిలో 8,648 కేసులు నమోదయ్యాయి.

కరోనావైరస్ కేసుల పెరుగుదల కొనసాగితే మహారాష్ట్రలో లాక్ డౌన్ అయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం పేర్కొన్నారు .

పూణేలో నైట్ కర్ఫ్యూ .. ఢిల్లీలో కేసుల తీవ్రత

పూణేలో నైట్ కర్ఫ్యూ .. ఢిల్లీలో కేసుల తీవ్రత

కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతున్న పూణే నగరంలో నైట్ కర్ఫ్యూ విధించారు. వారం రోజుల పాటు పూణే నగరంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ విధించి నట్లుగా పేర్కొన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అటు ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుదల ఆందోళనకరంగా మారుతుంది ఒక శుక్రవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో 3,594 కరోనా కేసులు నమోదయ్యాయి.


భారీగా పెరుగుతున్న కేసులతో అటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి .

English summary
India records 89,129 new Covid-19 cases as tally rises to 12,392,260. This comprises 44,213 active cases, 44,202 recoveries and 714 deaths. Death toll rises to 164,110.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X