ఒడిశాలో కరోనా కల్లోలం.. 1,061 చిన్నారులకు పాజిటివ్..
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒడిశాలో వైరస్ వ్యాప్తి కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,086 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,914 చేరింది. అయితే కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో 1,061 మంది చిన్నారులే ఉన్నారు. ఒక్కసారిగా ఇంత మంది చిన్నారులకు పాజిటివ్ నిర్థారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఉప్పెనా కరోనా వ్యాప్తి..
ఒడిశా రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనా విరుచుకుపడుతోంది. గచిన 24 గంటల్లో 70,990 శాంపిల్స్ పరీక్షించగా.. 11,086 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 80,914కి పెరిగింది. అత్యధికంగా 27 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఒక్క ఖుర్దా జిల్లాలో ఉండడం వైరస్ తీవ్రకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేసులు పాజిటివిటీ రేటు 15,62గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసుల్లోనూ ఖుర్దా జిల్లాలో 3,469 మంది కరోనా బారిన పడ్డారు.. అటు సుందర్ గఢ్ 1,416, కటక్ లో 766 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

చిన్నారులకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు..
అయితే కొత్తగా కరోనా బారిన పడ్డవారిలో 1,061 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క సారిగా ఇలా చిన్నారులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వారందరిని ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముంచుకోస్తున్ననేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరుతున్నారు. పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. రాష్ట్రంలో చిన్నారులు కరోనా వైరస్ బారిన పడుతుండడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

కాలేజీలో 125 మందికి పాజిటివ్
కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. మాండ్య జిల్లాలోని పీఈఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ కాలేజీలో మొత్తం 125మందికి మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 107 మంది విద్యార్థులు, 18మంది హాస్టల్ సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాలేజీ హాస్టల్ లో మొత్తం 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. దీంతో వారందరికి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని అధికారులు వెల్లడించారు..

పుదుచ్చేరిలో స్కూల్స్, కాలేజీలు మూసివేత
పుదుచ్చేరిలోనూ కరోనా కేసులు తీవ్ర పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,028 శాంపిల్స్ పరీక్షించగా 2,093 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,393కి పెరిగింది. ప్రస్తుతం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతలో పాజిటివిటీ రేటు 35.72 శాతం ఉంది. రికవరీ రేటు 91.27 ఉందని వైద్యాధికారులు తెలిపారు. మరణాల రేటు 1.35 శాతం ఉంది. రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరగడంతో అన్ని స్కూల్స్, కాలేజీలకు జనవరి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications