వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ కేసుల పెరుగుదలగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో యాక్టివ్ కేసులు 5 లక్షలకు చేరుకుంటున్నాయి.

కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులుకరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు

 భారత్ లో కరోనా పంజా .. 160 రోజుల్లో మొదటిసారిగా 62 వేలను దాటిన మార్క్

భారత్ లో కరోనా పంజా .. 160 రోజుల్లో మొదటిసారిగా 62 వేలను దాటిన మార్క్

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక నియంత్రణను తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. కఠినంగా కరోన రూల్స్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక కేంద్రం కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమైనదని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. 160 రోజుల్లో మొదటిసారిగా కరోనా రోజువారి కేసుల సంఖ్య 60,000 దాటడం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ లలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.

డిసెంబర్ 30 తర్వాత రోజువారీ మరణాలలో రికార్డ్ .. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ

డిసెంబర్ 30 తర్వాత రోజువారీ మరణాలలో రికార్డ్ .. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి 289 మంది మరణించారు. ఇది డిసెంబర్ 30వ తేదీ నుండి అత్యధికంగా నమోదైన రోజువారీ మరణాల సంఖ్య.

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం లో భాగంగా మార్చి 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించినట్లు మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్ తో అతలాకుతలమౌతున్న మహారాష్ట్రలో 36,902 కొత్త కేసులు నమోదయ్యాయి . ఇది ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన రికార్డు. తొమ్మిది రోజుల్లో ఇది ఆరోసారి రాష్ట్రం రోజువారీ కేసులకు కొత్త ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇక ముంబైలో 5,515 కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర వరుసగా రెండు రోజులు 35 వేలకు పైగా కేసులను నమోదు చేసింది.

 పంజాబ్ , గుజరాత్ లలో భారీగా కేసుల నమోదు ..ఒడిశాలో పెరుగుతున్న కేసులు

పంజాబ్ , గుజరాత్ లలో భారీగా కేసుల నమోదు ..ఒడిశాలో పెరుగుతున్న కేసులు

పంజాబ్ రాష్ట్రంలో 3,176 కొత్త కేసులు నమోదు కాగా, ఇది మొదటిసారిగా 3,000 మార్కును అధిగమించింది. రాష్ట్రంలో 59 మరణాలు నమోదయ్యాయి, గుజరాత్ శుక్రవారం 2,190 తాజా కేసులతో, వరుసగా ఐదవ రోజుకు అత్యధికంగా రోజువారీ కేసులను నమోదు చేసింది. ఒడిశా రాష్ట్రంలో 234 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో పండుగలను భారంగా సమావేశాలను ఒడిశా నిషేధించింది. మతపరమైన ఉత్సవాల కోసం పెద్ద సమ్మేళనాలను నిషేధిస్తూ ఒడిశా ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

 ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 20,000 మందికి పైగా వ్యాక్సిన్

ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 20,000 మందికి పైగా వ్యాక్సిన్

ఎందుకంటే రాష్ట్రంలోని కోవిడ్-19 సంఖ్య 234 కొత్త కేసులతో 3,39,694 కు పెరిగింది. ఏదేమైనప్పటికీ వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా, దేశంలో విపరీతంగా నమోదవుతున్న కరోనా కేసులు అని చూస్తే కరోనా మొదటి దశ రెండవ దశలోనే ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడుతున్నట్లు గా కనిపిస్తుంది.

ఇదిలావుండగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 20,000 మందికి పైగా లబ్ధిదారులకు కోవిడ్ -19 వ్యాక్సిన్ షాట్లు దేశ రాజధాని ఢిల్లీలో ఇచ్చినట్లుగా అధికారిక ప్రకటనలో పేర్కొంది. 45-59 సంవత్సరాల వయస్సు బ్రాకెట్‌లో 2,092 మంది లబ్ధిదారులు కరోనా వ్యాక్సిన్ లు అందుకోగా, 10,571 మంది సీనియర్ సిటిజన్లు కూడా సాయంత్రం 6 గంటలకు తమ మొదటి వ్యాక్సిన్ డోసులను పొందారని ఒక అధికారి తెలిపారు.

English summary
A total of 62,267 new infections of Covid-19 were reported across India on Friday, the highest single-day increase in cases since October 16, as the country’s second wave of the continued to push case numbers up. For the first time in 160 days, India’s daily Covid-19 tally crossed 60,000 with Maharashtra, Punjab and Gujarat recording the most number of cases. The country also recorded 289 deaths from the virus in the last 24 hours, the highest daily toll since December 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X