వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: 5-10 శాతం ఆస్పత్రి పాలు, ఈ రేటు పెరిగే అవకాశం ఉందన్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.52 లక్షల మంది నమూనాలను పరీక్షించగా.. 1,79,723 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 12.6 వాతం ఎక్కువ కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29 శాతానికి పెరిగింది. కాగా, మరో 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,23,619 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 2.03కి పెరిగింది. గత 24 గంటల్లో 146 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.62 శాతంగా ఉంది.

దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 4033 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1216 ఒమిక్రాన్ కేసులు ఉండగా, రాజస్థాన్ లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1552 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus: 5-10% Hospitalization Rate For 3rd Wave, May Change Rapidly: central Govt

కాగా, కరోనా యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. సెకండ్ వేవ్ టైమ్‌లో ఇది 20 నుంచి 23 శాతంగా ఉంది. అయితే కరోనా పరిస్థితిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ ప్రభావంతో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Recommended Video

Omicron Variant : Covid ‘Tsunami’ - WHO | Oneindia Telugu

ఈ నేపథ్యంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన కోవిడ్ అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్య శాఖ రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. యాక్టివ్ కేసుల సంఖ్య, హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు, ఆక్సిజన్ బెడ్స్ అవసరమైన రోగులు, ఐసీయూ బెడ్స్, వెంటిలేషన్ అవసరమైన కోవిడ్ రోగుల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రోజువారీగా పరిస్థితిని సమీక్షించాలన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా హెల్త్ కేర్ రంగంలో మౌలిక వసతులు, మానవ వనరుల అంశాలపై దృష్టిసారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

English summary
Coronavirus: 5-10% Hospitalization Rate For 3rd Wave, May Change Rapidly: central Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X