వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం వద్దు, కార్మికుల తరలింపు ప్రమాదమే: రాష్ట్రాలకు అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

Bill Gates: అమెరికాకు షాకిచ్చి, చైనాకు అనూహ్య మద్దతు, కరోనాపై పోరుకు భారీ విరాళం ప్రకటనBill Gates: అమెరికాకు షాకిచ్చి, చైనాకు అనూహ్య మద్దతు, కరోనాపై పోరుకు భారీ విరాళం ప్రకటన

కఠినంగా అమలు చేయాల్సిందే..

కఠినంగా అమలు చేయాల్సిందే..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి అన్ని నియంత్రణా చర్యలు చేపట్టాలని అన్నారు.

వలస కార్మికుల తరలింపుతో ప్రమాదం..

వలస కార్మికుల తరలింపుతో ప్రమాదం..

ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు ఇప్పుడే వెళ్లాల్సిన లేదా పంపాల్సిన, తీసుకెళ్లాల్సిన అవసరం లేదని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వలస కార్మికులు ఏయే రాష్ట్రంలో ఉన్నారో వారి బాధ్యతను ఆయా రాష్ట్రాలు తీసుకోవాలని, వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించాలని సూచించింది. ఇక సొంత గ్రామాల్లో ఉంటున్న వలస కార్మికుల కుటుంబాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్పష్టం చేసింది. వలస కార్మికులతో గ్రామీణ ప్రాంతాలకు కరోనావైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని, పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

Recommended Video

Covid-19 in AP : Amit Shah's Phone Call to Jagan Over Lockdown Extension
ప్రభుత్వాల బాధ్యతే.. 28వేలకు పెరిగిన కరోనా కేసులు

ప్రభుత్వాల బాధ్యతే.. 28వేలకు పెరిగిన కరోనా కేసులు

ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని, ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని కేంద్ర హోంశాఖ తెలిపింది. వలస కార్మికుల తరలింపు అనేది సమస్యను మరింత జఠిలం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వలస కార్మికులకు నిత్యావసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తగా అందించాలని, వారికి ఇబ్బంది లేకుండా చూడాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 28,087 కరోనా కేసులు నమోదు కాగా, 6573 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,628 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 886 మరణాలు సంభవించాయి.

English summary
In a video conferencing meeting with Prime Minister Narendra Modi and state Chief Ministers, Union Home Minister Amit Shah asked all CMs to enforce lockdown strictly in their respective states as reports of violations are coming to fore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X