Coronavirus: సీఎం నెంబర్ BU 61718, సామాన్య ప్రజలతో పాటు సీఎంకు కోవిడ్ 19 కోడ్, షాక్!
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు సామాన్య ప్రజలతో పాటు సీఎంలు, గవర్నర్, కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలు, సెలబ్రిటీలు హడలిపోతున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు కరోనా వైరస్ వ్యాధి సోకితే వారిని ఎలా గుర్తించడానికి ఒక నెంబర్ కేటాయిస్తారో అలాగే స్వయంగా ముఖ్యమంత్రికి ఓ COVID-19 నెంబర్ కేటాయించారు. సామాన్య ప్రజలతో పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న రోగిగా ఓ నెంబర్ తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీసింది.
Recommended Video

కరోనా రోగులకు కోవిడ్- 19 నెంబర్లు
కరోనా రోగుల వివరాలు, సమాచారం బయటకు రాకుండా, వైద్యులు త్వరగా చికిత్స అందించడానికి వారిని గుర్తించడానికి వీలుగా వారికి ప్రత్యేకంగా నెంబర్లు కేటాయిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి, ఆ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నెంబర్లు కేటాయిస్తూ వస్తున్నారు.

సీఎంకు పాజిటివ్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు ఆదివారం రాత్రి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. బెంగళూరులోని పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో సీఎం బీఎస్. యడియూరప్పకు చికిత్స అందిస్తున్నారు. మణిపాల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ పర్యవేక్షణలో వైద్యులు సీఎం. బీఎస్. యడియూరప్పకచికిత్స అందిస్తున్నారు.

సీఎం నెంబర్ 61718
కరోనా వైరస్ సోకిన వారికి ఎలా ప్రత్యేకంగా నెంబర్లు కేటాయిస్తున్నారో అలాగే బీబీఎంపీ అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు ఓ నెంబర్ కేటాయించారు. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ సోకిన వారికి కేటాయించే విధంగా బీబీఎంపీ వైద్య శాఖ అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు ఓ నెంబర్ కేటాయించారు. BU (BENGALURU URBEN DISTRICT) 61718 నెంబర్ ను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీబీఎంపీ అధికారులు కేటాయించారు.

బెంగళూరు ప్రజలతో సమానం
బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ విధంగా ఉందో సీఎం బీఎస్. యడియూరప్పకు కేటాయించిన నెంబర్ ఆధారంగా తెలుస్తోంది. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ వచ్చిన వారికి, కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరికి బీబీఎంపీ వైద్య శాఖ అధికారులు ఓ నెంబర్ కేటాయిస్తున్నారు. సీఎం బీఎస్. యడియూరప్పకు BU 61718 నెంబర్ కేటాయించడంతో బెంగళూరు సిటీలో 61, 718పై కేసులు నమోదు అయ్యాయని అధికారికంగా వెలుగు చూసింది. మొత్తం మీద కరోనా రోగులకు కేటాయించినట్లే సీఎం బీఎస్. యడియూరప్పకు ఓ ప్రత్యేకమైన నెంబర్ కేటాయించడంతో ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారితీసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications