వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విజృంభణ: దేశంలో 9 లక్షల దాటిన కరోనా కేసులు, రికవరీ రేటూ పెరిగింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింత విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 28,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో 553 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 23,727కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 5,71,460 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,11,565 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.02 శాతంగా ఉంది. మృతుల రేటు 2.64శాతంగా ఉంది.

 Coronavirus cases in India cross 9 lakh, recoveries rise to 5.7 lakh

కాగా, గత మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో జులై 1 నుంచి 3,21,259 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 6327 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమిళనాడులో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షలను కూడా భారీ నిర్వహిస్తోంది. జులై 13 నాటికి దేశంలో కోటి 20 లక్షల నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1200 కేంద్రాలకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 2 లక్షలకుపైగా కరోనా పరీక్షలు జరుగుతుండటం గమనార్హం.

English summary
The number of fresh coronavirus cases in India rose 28,498 today, pushing its overall tally to 906752, even as the recovery rate further improved. The death toll climbed to 23,727 with 553 people succumbing to the infection in past 24 hours, according to Health Ministry's latest data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X