వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:సొంతవారే దూరం పెడుతున్న వేళ.. బాధ్యతను తీసుకున్న పోలీసులు,హ్యాట్సాఫ్..!

|
Google Oneindia TeluguNews

కరోనా ఉధృతి వేగంగా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రోజుకు కొన్ని వేల సంఖ్యలో అక్కడ కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఢిల్లీలో వారం రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం అదే సమయంలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటం ఒక్కింత ఆందోళనకు గురిచేస్తోంది.

న్యూఢిల్లీలో కరోనా కేసులు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక కేసులు పెరుగుతుండటంతో పేషెంట్లకు తమవంతు సహాయం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. పేషెంట్లను హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, వారికోసం బెడ్స్ మరియు ఆక్సిజన్‌ను సిద్ధం చేయడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు మరణించినవారిని స్మశానవాటికకు తరలించడంలో కూడా ఈ ఫ్రంట్‌లైన్ వారియర్స్ సహాయ తీరును ప్రతిఒక్కరూ కొనియాడుతున్నారు. గతేడాది వారి డ్యూటీలో భాగంగా మాస్కులు, భోజనం మాత్రమే కరోనా పేషెంట్లకు పోలీసులు అందించేవారు. కానీ ఈ సారి మాత్రం మానవత్వంను సైతం ప్రదర్శిస్తూ పేషెంట్లకు అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నారు. ఇక ఓ హాస్పిటల్‌లో ఆక్సిజన్ సప్లయ్ లేక 200కు పైగా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆక్సిజన్ సప్లయ్ త్వరగా ఇచ్చేందుకు గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్న రెండు ట్యాంకర్లు ఢిల్లీ సరిహద్దుల్లో నిలిచిపోయాయి.

Coronavirus:Delhi Police acts with humanity, Have a look as what they are doing

ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ పోలీసులు చాలా చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత ఉండటంతో పోలీసులు కరోనా పేషెంట్లకు తక్కువ సమయంలోనే సప్లయ్ చేశారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లోని పేషెంట్లకు రెమిడెసివీర్ డ్రగ్ కూడా ఢిల్లీ నుంచి పంపడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఢిల్లీ హాస్పిటల్స్‌లో పడకలు లేకపోవడంతో ఓ వృద్ధురాలికోసం ఏకంగా పబ్లిక్ పార్కును కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోని రాజిందర్‌నగర్‌లో ఓ 80 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ రావడంతో అతని కూతురు పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వృద్దుడిని హాస్పిటల్‌లో చేర్చినట్లు చెప్పారు సెంట్రల్ ఢిల్లీ డీసీపీ జస్మీత్ సింగ్.

ఇక ఆదివారం రోజున కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో పోలీసులే ఒక వాహనంను అరేంజ్ చేసి ఆ మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు. ఇక ప్లాస్మా విషయంలో కూడా ఢిల్లీ పోలీసులు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇక కరోనా పేషెంట్లకు సహాయసహకారాలు అందించే క్రమంలో 8వేలకు పైగా పోలీసులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 35 మంది పోలీసులు మరణించారు.ఇందులో 90శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

మొత్తానికి కరోనాతో అట్టుడికిపోతున్న ఢిల్లీలో పోలీసులు మానవత్వంను ప్రదర్శించి తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుండి సహాయం చేస్తున్న విధానంకు ఢిల్లీ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.

Recommended Video

COVID-19 Predominantly Spreads Through Air - Lancet Study || Oneindia Telugu

English summary
Delhi Police are playing a keyrole in helping the Covid patients reach Hospital, providing oxygen etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X