భారత్ లో కోవిడ్ కలకలం- వ్యాక్సిన్ ఫోర్త్ డోస్ తప్పనిసరా ? నిపుణులేమంటున్నారు?
భారత్ లో మరోసారి కోవిడ్ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ పాత వేరియంట్ తో పాటు కొత్త వేరియంట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనాలో భారీ సంఖ్యలో నమోదవుతున్నకేసులు, మరణాల నేపథ్యంలో మన దేశంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తుచేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై మరోసారి చర్చ సాగుతోంది. దీనిపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

భారత్ లో మళ్లీ కోవిడ్ కల్లోలం
భారత్ లో కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటివరకూ తొలి రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారు మూడో డోస్ తీసుకోవాలా, మూడో డోస్ వరకూ తీసుకున్న వారు నాలుగో డోస్ తీసుకోవాలా వంటి అంశాలపై జనంలో చర్చ జరుగుతోంది. ఓమిక్రాన్ కొత్త వేరియంట్ పై ఈ వ్యాక్సిన్ డోసులు ఎంత మేరకు పనిచేస్తున్నాయి.
వ్యాక్సిన్ తయారీ సంస్ధలు కొత్త డోస్ లను తయారు చేస్తున్నాయా, చేస్తే ఎప్పటికి వాటిని అందుబాటులోకి తెస్తాయి వంటి అంశాలపై జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిపుణులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు.

వీరికి మూడో డోస్ తప్పనిసరి..
భారత్ లో వెలుగుచూస్తున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో వయోవృద్ధులు తప్పనిసరిగా ప్రికాషనరీ డోస్ (మూడో డోస్) తప్పనిసరిగా తీసుకోవాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ వీకే పౌల్ స్పష్టంచేశారు. తాజాగా కోవిడ్ పరిస్ధితిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. మూడో డోస్ అవసరాన్ని మరోసారి గుర్తుచేశారు. గతంలో మూడో డోస్ తీసుకోని పెద్దలు.. ఇప్పుడు తాజా పరిస్దితుల నేపథ్యంలో దాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో మూడో డోస్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు జనం పరుగులు తీస్తున్నారు.

నాలుగో డోస్ తప్పనిసరా?
అలాగే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్న వారు నాలుగో డోస్ తీసుకోవాల్సి ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. లేకపోతే మూడో డోసే ఇప్పుడు పనికొస్తుందా అన్నచర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ రణ్ దీప్ గులేరియా తాజాగా దీనిపై స్పందించారు.
ప్రస్తుతానికి మూడో డోస్ సరిపోతుందని, నాలుగో డోస్ అవసరం రేదని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో పరిస్ధితి మరింత తీవ్రమైతే అప్పుడు కేంద్రం దీనిపై స్పష్టత ఇస్తుందంటున్నారు. దీంతో నాలుగో డోస్ పై దాదాపుగా క్లారిటీ వచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications