42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆస్పత్రుల నుంచి కరోనా రోగులు పారిపోతుండటం ఆందోళనకరంగా అంశంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 42 మంది కరోనా రోగులు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టారు.

ఘాజీపూర్‌లో కొందరు వ్యక్తులు ల్యాబ్‌లో స్వాబ్ ఇచ్చిన సందర్భంలో తప్పుడు ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వారి జాడ తెలియడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌కు ఈ విషయాన్ని తెలుపుతూ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేకే వర్మ లేఖ రాశారు.

Coronavirus in UP: 42 Patients go ‘Missing’ in Ghazipur, Manhunt on to Trace Them

42 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి సరైన మొబైల్ నెంబర్, చిరునామా ఇవ్వలేదని తెలిపారు. అయితే, వారందరికీ కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. వీరంతా ఆస్పత్తరుల్లో గానీ, హోంక్వారంటైన్లో గానీ లేరని తెలిపారు.

తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా వారిని పట్టుకోవడం కూడా కష్టతరంగా మారిందని ఆ అధికారి చెబుతున్నారు. ఫారంలో వారు పేర్కొన్న అడ్రస్, ఫోన్ నెంబర్లు తప్పు అని తేలడంతో ఈ ఘటన వెలుగుచూసిందని తెలిపారు. పరారీలో ఉన్న కరోనా రోగులను గుర్తించేందుకు గాలింపు చేపట్టామని చెప్పారు.

కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 85,461 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34,968 యాక్టివ్ కేసులున్నాయి. 48,863 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,630 మంది కరోనా బారినపడి మరణించారు.

Recommended Video

    Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+