బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ మా దగ్గరకు రాకుండా చూడు దేవుడా అంటూ దేవుడిని వేడుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్ బారినపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 1 లక్షా 96 వేల మందికిపైగా కరోనా వైరస్ తో మరణించారు. అయితే కరోనా వైరస్ లేని దేశంగా కైలాస దేశం పేరుతో ఇప్పుడు నిత్యానందస్వామి అలియాస్ నిత్యానంద మహిళా శిష్యులు తెర మీదకు వచ్చారు. నిత్యానందస్వామి సృష్టించుకున్న కైలాస దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని, ఒక్కరు కూడా ఆ దేశంలో మరణించే అవకాశం లేదని నిత్యానంద శిష్యులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ లో చిక్కుకుపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిత్యానంద శిష్యులు మాత్రం కైలాస దేశంలో రొమాంటిక్ సాంగ్స్ తో, ఆటాపాటలతో ఎంజాయ్ చేస్తూ చిందులు వేస్తున్న టిక్ టాక్ వీడియోలు విడుదలై వైరల్ అవుతున్నాయి.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

ప్రపంచం మొత్తం కరోనా కరోనా కరోనా

ప్రపంచం మొత్తం కరోనా కరోనా కరోనా

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా, వింటున్న మాట ఒక్కటే. అదే కరోనా వైరస్. కరోనా వైరస్ దెబ్బతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1 లక్షా 96 వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికీ 2 కోట్లా 79 లక్షల మంది కరోనా వైరస్ వ్యాధితో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసి ఇప్పటి వరకు 7 లక్షలా 81 వేల మంది మాత్రం ప్రాణాలతో భయటపడ్డారు.

భారతదేశంలో కరోనా

భారతదేశంలో కరోనా

భారతదేశంలో ఇప్పటి వరకు 24, 506 వేల మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దేశవ్యాప్తంగా 5, 063 మంది మాత్రమే కరోనా వైరస్ ను జయించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 775 మంది కరోనా వైరస్ తో మరణించారు. యూరోపియన్ దేశాలు సైతం కరోనా వైరస్ ను జయించాలని ప్రతిరోజు 24 గంటలు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఫలితం అంతంత మాత్రంగానే ఉండటంతో కరోనా పేరు చెబితె ప్రాణాలు పైకిపోతున్నాయని ప్రజలు అంటున్నారు.

నిత్యానందస్వామి మహత్యం

నిత్యానందస్వామి మహత్యం

ఐటీ బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటి బెంగళూరు నగరం శివార్లలోని బిడిది కేంద్రంగా ధ్యానపీఠం ఆశ్రమం నిర్వహిస్తున్న వివాదాస్పద స్వామిజీ నిత్యానందస్వామి మరోసారి తెరమీదకు వచ్చారు. ప్రస్తుతం విదేశాలకు పారిపోయిన నిత్యానందస్వామి ఆయన సృష్టించుకున్న కైలాసం దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని, అక్కడ ఎవ్వరూ ఆ వ్యాధితో చనిపోయే అవకాశం లేదని ఆయన మహిళా శిష్యులు అంటున్నారు.

నిత్యానందస్వామిని మరచిపోయారా ?

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద ఆయన ఆశ్రమంలో యువతులను నిర్బంధించారని ఆరోపణలు రావడం, కేసులు నమోదు కావడంతో ఆయన దేశం విడిచి నకిలి పాస్ పోర్టుతో విదేశాలకు పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్క కరోనా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో నిత్యానందస్వామిని మరచిపోయారా ? అంటూ ఆయన మహిళా శిష్యులు తెరమీదకు వచ్చారు.

నిత్యానందస్వామి దెబ్బకు మా దేశంలో కరోనా లేదు

విదేశాలకు పారిపోయిన నిత్యానంద కైలాసం అనే దేశాన్ని సృష్టించుకుని శిష్యులు, యువతులతో కలిసి ఆయన అక్కడే ఉంటున్నారని చాలాకాలం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రపంచం అంతా కరోనా వైరస్ తో భయపడుతోందని, మాదేశం కైలాసంలో ఒక్క కరోనా కేసు లేదని, ఇది కరోనా గ్రీన్ జోన్ అంటూ ఇప్పుడు నిత్యానంద మహిళా శిష్యులు టిక్ టాక్ వీడియోలతో తెరమీద ప్రత్యక్షం అయ్యారు.

రొమాంటిక్ సాంగ్స్ తో చిందులు

రొమాంటిక్ సాంగ్స్ తో చిందులు

కరోనా వైరస్ లేని మా కైలాసం దేశంలో మేము చాలా సంతోషంగా ఉన్నామని, అందుకే కరోనా రాకముందే మాదేశానికి రావాలని నిత్యానందస్వామి మిమ్మల్ని అందర్నీ ఆహ్వానించారని ఆయన మహిళా శిష్యులు చెబుతున్న వీడియో విడుదలైయ్యింది. కరోనా దెబ్బబకు అందరూ లాక్ డౌన్ అమలులో ఉంటున్న సందర్బంగా సమదూరం పాటిస్తుంటే కైలాసంలో నిత్యానంద శిష్యులైన యువతులు, మహిళలు రంగురంగుల దుస్తులు వేసుకుని మన్నన్ సినిమాలోని వితౌట్ గెట్టింగ్ బి హైండ్ ది ఉమెన్ అనే రోమాంటిక్ పాట పెట్టుకుని ఆటాపాటలతో చిందులు వేస్తూ టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రియ నితి అనే యువతి పేరుతో ఈ టిక్ టాక్ వీడియోలు విడుదల అయ్యాయి.

Recommended Video

Coronavirus Created By China And Left To The World Says Scientist
శివుడి రూపంలో నిత్యానందస్వామి

శివుడి రూపంలో నిత్యానందస్వామి

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అంతా విలవిలలాడుతున్న సమయంలో అవేవిపట్టనట్లు నిత్యానందను శివుడి రూపంతో పోల్చుతూ ఆయన మహిళా శిష్యులు డ్యాన్స్ లు వేస్తూ టిక్ టాక్ వీడియోలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీ లోలుడిగా ముద్ర వేసుకున్న నిత్యానంద ప్రస్తుతం ఆయన స్వయంగా సృష్టించుకున్న కైలాసం దేశంలో హ్యాపిగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద తమకు కరోనా అంటే భయం లేదని, మాకు నిత్యానందస్వామి ఆశీస్సులు ఉన్నాయని ఆయన మహిళా శిష్యులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కరోనా కాలంలో మహిళా శిష్యుల మధ్య నిత్యానందస్వామి ఎంజాయ్ చేస్తున్నారని వెలుగు చూసింది.

English summary
Coronavirus: Kailasaa where Nithyananda believed to be living is corona free nation, claim his women followers, their tiktok videos comes out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X