Coronavirus: CM కొడుక్కి స్పెషల్ రూల్స్ ?, భార్యతో కలిసి ఎంట్రీ, మేము ఏం పాపం చేశాము ?
బెంగళూరు/ మైసూరు: కర్ణాటకలో కరోనా వైరస్ భరతనాట్యంతో పాటు, బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తోంది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ దెబ్బతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు పూర్తిగా మూసి వేశారు. అర్చకులు మాత్రమే ఆలయంలో దీపం వెలిగించి దేవుడికి నైవేద్యం పెట్టి తలుపులు మూసేస్తున్నారు. భక్తులు దేవాలయం బయట నుంచి భగవంతుడికి నమస్కారం చేసుకుని వెనుతిరుగుతున్నారు .ఇలాంటి సమయంలో దేవాలయం తలుపులు తీపించిన సీఎం కొడుకు, ఆయన భార్య 8 మంది గన్ మ్యాన్ లతో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు చెయ్యడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. లాక్ డౌన్ రూల్స్ ప్రజలు అందరికి వర్థిస్తాయని స్వయంగా సీఎం చెప్పారని, ఆయన కొడుకు, కోడలికి ఏమైనా ప్రత్యేకంగా రూల్స్ పెట్టారా ? అని ప్రజలు ప్రశ్నించడంతో ప్రతిపక్ష పార్టీల చేతికి బలమైన ఆయుధం చిక్కినట్లు అయ్యింది.

ఆలయాల తలుపులు బంద్
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసివేశారు. ఈ ఏడాది రంజాన్ పండుగను ముస్లీం సోదరులు వారివారి ఇళ్లలోనే జరుపుకున్నారు. కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ దెబ్బతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు పూర్తిగా మూసి వేశారు. అర్చకులు మాత్రమే ఆలయంలో దీపం వెలిగించి దేవుడికి నైవేద్యం పెట్టి తలుపులు మూసేస్తున్నారు. భక్తులు దేవాలయం బయట నుంచి భగవంతుడికి నమస్కారం చేసుకుని వెనుతిరుగుతున్నారు .

తలుపులు తీపించిన సీఎం కొడుకు !
కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ప్రసిద్ది చెందిన శ్రీ నంజనగూడు శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం ఉంది. లాక్ డౌన్ దెబ్బతో శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం తలుపులు మూసి వేసి భక్తులను ఆలయం లోపలికి అనుమంతించడంలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు బివై. విజయేంద్ర శ్రీకంఠేశ్వరస్వామి ఆలయం అధికారి రవీంద్రకు నచ్చచెప్పి గుడి తలుపులు తీపించారు.

భార్య, 8 మంది గన్ మ్యాన్ లు ఎంట్రీ
నంగజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయం తలుపులు తీపించిన సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు బివై. విజయేంద్ర ఆయన భార్యతో కలిసి సుమారు అర్దగంటకు పైగా ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి అధికారులు అవకాశం కల్పించారని వెలుగు చూసింది. ఇదే సమయంలో సీఎం కొడుకు విజేయంద్రకు భద్రత కల్పిస్తున్న 8 మంది గన్ మ్యాన్ లు కూడా విజయేంద్ర దంపతుల వెంట ఆలయంలోకి వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి.

కపిలా నదిలో బాగినం సమర్పణ
శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు విజయేంద్ర దంపతులు నేరుగా కపిలా నది తీరంలోకి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి నదీ తీరంలో గంగాదేవికి బాగినం ( మొక్కులు) సమర్పించారు. సీఎం కొడుకు విజయేంద్ర దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సీఎం కొడుక్కి ప్రత్యేకంగా రూల్స్ పెట్టారా ?
కర్ణాటక సీఎం విజయేంద్ర దంపతులు దేవాలయంలో, కపిలా నదితీరంలో ప్రత్యేక పూజలు చేసే సమయంలో స్థానికులు ఎవ్వరూ అక్కడికి రాకుండా, మీడియా ఫోటోలు, వీడియోలు తీకుండా అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. కర్ణాటక మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారని, సీఎం కొడుకు విజయేంద్ర ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకంగా రూల్స్ పెట్టారా ? అంటూ కర్ణాటక ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తం మీద సీఎం బీఎస్. యడియూరప్ప మరోసారి ప్రతిపక్షాలకు చిక్కడంతో ఆయన వ్యతిరేక వర్గం సంతోషంగా ఉన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications