దేశంలో కరోనా ఆందోళన: 7రోజుల పాటు లాక్ డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో విజృంభిస్తున్న కరోనా, సరిహద్దు దేశాలలో కూడా విజృంభించే అవకాశం ఉందన్న అనుమానాలతో ఇప్పటికే అనేక దేశాల్లో అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి పై ఆందోళన కొనసాగుతోంది.

దేశంలో కరోనా ఆందోళన .. ఏడు రోజుల పాటు లాక్ డౌన్?
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బిఎఫ్ 7 కారణంగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జాగ్రత్తలు వహించాలని సూచనలు చేసింది. ఇక ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచనలు చేసింది. ఇక ఇదే సమయంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం భారతదేశంలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయబడుతుంది అని పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి.

యూట్యూబ్ చానల్స్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లాక్ డౌన్ ప్రచారం
అనేక యూట్యూబ్ ఛానల్స్ దేశంలో ఏడు రోజుల పాటు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించబడుతుందని ప్రచారం చేశాయి. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నేపధ్యంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు సదరు యూట్యూబ్ చానల్స్ వెల్లడించాయి. కోవిడ్-19 నాల్గవ తరంగాల భయాందోళనల మధ్య, భారత ప్రభుత్వం 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించిందని పేర్కొంటూ వైరల్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 24 నుండి భారతదేశంలో లాక్‌డౌన్ విధించబడుతుందని మరియు ఆంక్షలు ఒక వారం పాటు అమలులో ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

జనాల్లో కరోనా కర్ఫ్యూ పై చర్చ
అంతేకాకుండా, అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అంతేకాదు విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రజలలో మరింత భయాందోళన నెలకొంది. పెద్ద ఎత్తున మళ్ళీ కర్ఫ్యూ విధిస్తారని జనాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ వార్తలలో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొంది.

లాక్ డౌన్ వార్తలపై కేంద్రం క్లారిటీ
కొన్ని రకాల మీడియాలలోనూ, యూట్యూబ్ ఛానల్స్ లోనూ వస్తున్న వార్తలు పుకార్లేనని, ప్రభుత్వం అటువంటి చర్యల దిశగా ఆలోచనలు చేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని, కర్ఫ్యూను అమలు చేయాల్సిన పరిస్థితి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కర్ఫ్యూ ఆలోచనే లేదని పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని సూచించింది.
-
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications