coronavirus: నేడు దేశమంతా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్: ఫోర్త్ వేవ్ ఆందోళనతో ముందస్తు చర్యలు!!

దేశంలో ప్రస్తుతం కరోనా ఆందోళన కొనసాగుతోంది. చైనాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, భారతదేశంలోనూ కరోనాపై టెన్షన్ కొనసాగుతుంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న ప్రతీసారీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ వస్తుంది. తాజాగా కరోనా నాలుగో వేవ్ కి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం నేడు దేశమంతా మాక్ డ్రిల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో నేడు దేశ వ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

 కరోనా ఫోర్త్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ నేడే

కరోనా ఫోర్త్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ నేడే

దేశవ్యాప్తంగా నేడు నిర్వహిస్తున్న కరోనా మాక్ డ్రిల్ లో వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అందరూ పాల్గొంటారు. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్ గా చేస్తారు. కరోనా పేషెంట్లను ఆసుపత్రులకు తీసుకు రావడం, వారికి మందులు ఇవ్వడం, వారికి ఆక్సిజన్ ఇవ్వడం, ఐసోలేషన్, క్వారంటైన్, కరోనా జాగ్రత్తలు పాటించటం వంటి కరోనా కు సంబంధించిన చేయాల్సినవన్నీ ఒకసారి ఈ మాక్ డ్రిల్ లో చేస్తారు.

ముందస్తు మాక్ డ్రిల్ తో లాభం ఇదే

ముందస్తు మాక్ డ్రిల్ తో లాభం ఇదే

ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒకవేళ కరోనాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వైద్యులు, సిబ్బంది ఏం చేస్తారో, అదే ప్రస్తుతం చేసి చూపిస్తారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ఎక్కడైనా వైద్య వసతుల లోపాలు ఉంటే అర్థమవుతుంది. ప్రధానంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్య వసతుల లభ్యత, ఐసోలేషన్ బెడ్‌ల సామర్థ్యం, ఆక్సిజన్‌తో కూడిన బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు మరియు వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్‌లు, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సరైన లభ్యత వంటి పారామీటర్స్ పై ఈ మాక్ డ్రిల్ దృష్టి సారిస్తుంది. తద్వారా వసతులను మెరుగుపరచుకోవటానికి అవకాశం కలుగుతుంది. ముందస్తు ప్రిపరేషన్ వల్ల ఏయే లోపాలు ఉన్నాయో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవు అనుకుంటే, ఐసీయూలో కొరత ఉందని అనిపిస్తే.. ఇలా ఎన్నో లోపాలు ఉంటే అందులో లోపాలను సవరించడానికి అవకాశం కలుగుతుంది.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బీఎఫ్ 7 ఆందోళన .. అప్రమత్తం చేస్తున్న కేంద్రం

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బీఎఫ్ 7 ఆందోళన .. అప్రమత్తం చేస్తున్న కేంద్రం


ఎన్నో విషయాలపై ముందుగా వైద్యులను, సిబ్బందిని రెడీ చేయడం కోసం, వచ్చే ఉపద్రవాన్ని ముందుగానే ఎదుర్కొనే సన్నద్ధత కోసం కేంద్రం మాక్ డ్రిల్ చేయాలని పిలుపునిచ్చింది. ఏది ఏమైనా ప్రపంచమంతా చైనాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం దెబ్బకు మరోమారు వణికిపోతుంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బీఎఫ్ 7 ప్రభావం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరగవద్దు అని, కరోనా జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ పరిశీలన

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ పరిశీలన

వచ్చే కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలని చెప్పడంతో, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను మళ్ళీ పునరుద్ధరించే పనిలో పడ్డాయి. ఇక ప్రజలకు మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నాయి. ఇక నేడు నిర్వహించనున్న మాక్ డ్రిల్ ను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పరిశీలించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+