Coronavirus:గుడ్ న్యూస్.. ధారావిలో తగ్గుతోన్న కేసులు, 24 గంటల్లో 6 పాజిటివ్ కేసులు...

ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 6 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం మాత్రం 25 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2.1 స్వ్కేర్ కిలోమీటర్ల ధారావిలో 8 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇరుకు ఇళ్లలో వారు కాలం వెల్లదీస్తున్నారు.

Recommended Video

    Mumbai Dharavi Reports Sharp Drop In New Corona Cases
    220 పాజిటివ్ కేసులు

    220 పాజిటివ్ కేసులు

    ధారావిలో 220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. శుక్రవారం కూడా ఒకరు చనిపోయారు. ఇక్కడ సామాజిక దూరం పాటించడం కష్టమవుతోన్న క్రమంలో వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తూ.. లక్షణాలు ఉన్న వారికి క్వారంటైన్‌కు తరలిస్తూ తగిన జాగ్రత్తలను అధికారులు తీసుకున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు ఇంటింటికీ మరీ తిరిగి వైరస్ గురించి అవగాహన కల్పించి.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు.

     1.5 లక్షల మంది...

    1.5 లక్షల మంది...


    ధారావిలో లక్షన్నర మంది ప్రజలకు కంటైన్మెంట్ జోన్లలో ఉండగా.. వారికి అవసరమైన సరుకులు, మందులను సిబ్బంది ఇంటింటికీ అందిస్తున్నారు. అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇప్పటికే 50 వేల మందిని పరీక్షించారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. ధారావి మురికివాడలో వైరస్ కేసుల సంఖ్య తగ్గడంపై అధికారులు, వైద్యులు కాస్త ఉపశమనం పొందారు.

    ఒక్కరోజే 778 కేసులు

    ఒక్కరోజే 778 కేసులు

    మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 778 పాజిటివ్ కేసులు నమోదయయాయి. ఇందులో ముంబైలోనే 522 కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ముంబై మహిమ్‌లో ఒక కొత్త కేసుతో సంఖ్య 25కి చేరగా, మధ్య ముంబై దాదార్‌లో కూడా ఒక కొత్త కేసుతో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా వైరస్ అత్యధిక కేసులు వర్లీ ప్రభాదేవి ప్రాంతంలో నమోదయ్యాయి. జీ సౌత్ వార్డులో 534 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జిజామాతానగర్‌లో ఇప్పటికీ చాలా కంటైన్మెంట్ ఏరియాలు చాలా ఉన్నాయి. అక్కడ వైద్య సిబ్బంది శిబిరాలు నెలకొల్పి స్కీనింగ్ చేస్తూనే ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+