బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్, 24 గంటల్లో సీన్ రివర్స్, వస్తే 14 రోజులు క్వారంటైన్, సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువైపోతున్నాయి. దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కర్ణాటక ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వం కితాబు ఇచ్చింది. అయితే రెండు రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ తో ఒక్కసారిగా కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది.

మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కరోనా వైరస్ కట్టడి కోసం క్వారంటైన్ నియమాలను ఒక్కసారిగా కఠినం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.

Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్?Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్?

రెండు రోజుల్లో సీన్ రివర్స్

రెండు రోజుల్లో సీన్ రివర్స్

భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా వైరస్ కట్టడిలో కర్ణాటక ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ రెండు రోజుల క్రితం కితాబు ఇచ్చింది. అయితే రెండు రోజుల్లో కర్ణాటకలో సీన్ తారుమారైయ్యింది. ఒక్కసారిగా కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. సోమవారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

 ఇతర రాష్ట్రాల దెబ్బ

ఇతర రాష్ట్రాల దెబ్బ

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య ఎక్కువ అయ్యిందని, వారి వలనే కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు సీఎం బీఎస్. యడియూరప్ప దృష్టికి తీసుకువచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని కట్టడి చేస్తే కర్ణాటకలో కరోనా వైరస్ ను అరికట్టడానికి అవకాశం ఉంటుందని పలువురు మంత్రులు సీఎం బీఎస్. యడియూరప్పకు చెప్పారని తెలిసింది.

ఎవరైనా సరే క్వారంటైన్!

ఎవరైనా సరే క్వారంటైన్!

మంత్రులు, అధికారులతో సమావేశం పూర్తి అయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వస్తున్న వారు లాక్ డౌన్ నియమాలను గాలికి వదిలి ఇష్టం వచ్చినట్లు తిరగడం వలనే కరోనా వైరస్ వ్యాపిస్తోందని ఆరోపించారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య ఊహించని దాని కంటే ఎక్కువగా ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు ఎవరైనా సరే కచ్చితంగా క్వారంటైలో ఉండాలని సీఎం బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు.

14 రోజులు క్వారంటైన్ గ్యారెంటి

14 రోజులు క్వారంటైన్ గ్యారెంటి

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో సమావేశం అయిన తరువాత ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ చేసిన ట్వీట్ ఇతర రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురైనారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి రికవరి రేటు 61.39 % ఉందని మంత్రి సుధాకర్ ట్విట్ చేశారు. అయితే గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయిందని, అందు వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైనా సరే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ట్విట్ చేశారు.

క్లారిటీ లేకపోవడంతో గందరోగళం

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ట్విట్ చెయ్యడంతో కర్ణాటకకు వెళ్లడానికి సిద్దం అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు హడలిపోయారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కర్ణాటకకు వెళ్లి వస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు బెంగళూరు వెలితే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండాలా ? లేక హోమ్ క్వారంటైన్ లో ఉండాలా ? అనే కచ్చితమైన క్లారిటీ లేకపోవడంతో తెలుగు ప్రజలు అయోమయానికి గురౌతున్నారు.

English summary
Coronavirus: New Rule in Karnataka, 14 Days quarantine for everyone who arrived from neighboring states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X