• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

COVID-19: కైలాసంలోకి భారతీయులకు నో ఎంట్రీ, నిత్యానంద, నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా !

|

చెన్నై/ బెంగళూరు: అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన నిత్యానందస్వామి అలియాస్ నిత్యానందకు ఆయన పుట్టిన భారతదేశం ఇప్పుడు చేదుగా కనపడుతోంది. నేను దైవమానవుడు అని గొప్పలు చెప్పుకుని విదేశాలకు పారిపోయిన నిత్యానంద సొంతంగా కైలాసదేశం ఏర్పాటు చేసుకుని నేనే రాజు, నేనే మంత్రి అంటూ చలామణి అవుతున్నాడు. కరోనా వైరస్ (COVID-19) తాండవం చేస్తున్న భారతదేశం నుంచి ఏ ఒక్క భక్తుడు కూడా మా కైలాసదేశంలో అడుగుపెట్డడానికి వీల్లేదని నిత్యానంద అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. భారత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు నిత్యానంద మాట్లాడుతున్న వీడియో చూసిన భారతీయులు నిత్యానంద భారత్ పోలీసులకు ఎప్పుడు చిక్కుతావో కాని ? ఆరోజు నీకు. ఉంటుంది నా సామిరంగా...... ? అంటూ లెక్కలేనంత మంది భారతీయులు ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు.

  Kailasa లోకి భారతీయులను రానివ్వను - Nithyananda... నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా !

  Lovers: ప్రియురాలికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ ?, రొమాన్స్ కు పిలిచి ఏం చేశాడంటే ?Lovers: ప్రియురాలికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ ?, రొమాన్స్ కు పిలిచి ఏం చేశాడంటే ?

  కైలాస దేశానికి A to Z నిత్యానంద

  కైలాస దేశానికి A to Z నిత్యానంద

  అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామి అలియాస్ నిత్యానందకు 2019లో గుట్టుచప్పుడు కాకుండా నకిలి పాస్ పోర్టుతో రాత్రికి రాత్రే జెండా ఎత్తేసి విదేశాలకు చెక్కేశాడు. ఈక్విడార్ లో తలదాచుకున్న నిత్యానంద అక్కడ సొంతంగా కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నాడు. కైలాస దేశానికి నిత్యానంద A to Z అయిపోయి ఆయన అక్కడ రాజ్యం ఏలుతున్నాడు.

   రేప్ కేసులో జైలుపాలు

  రేప్ కేసులో జైలుపాలు

  అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద, ఆయన అనుచరులు కొందరిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు సమీపంలోని బిడిదిలో ధ్యానపీఠం ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వేలాది మంది భక్తులను ఆకర్షించిన నిత్యానందకు తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. రేప్ కేసులో అరెస్టు అయిన నిత్యానంద కొంతకాలం రామనగర సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి దేశం విడిచి జెండా ఎత్తేశాడు.

  కరోనా భయంతో భారతీయులకు నో ఎంట్రీ

  కరోనా భయంతో భారతీయులకు నో ఎంట్రీ

  ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో భారతదేశంలో రోజురోజుకు లక్షల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ లో కైలాసంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని గతంలోనే ప్రకటించుకున్న నిత్యానంద ఇప్పుడు మా దేశంలోకి (కైలాసం) భారతీయులు ఎవ్వరినీ అనుమతించమని ఓ వీడియో విడుదల చేశాడు.

  ఆదేశాల భక్తులకు అవకాశం లేదు

  ఆదేశాల భక్తులకు అవకాశం లేదు

  భారతదేశంతో పాటు బ్రెజిల్, యూరోపియన్ దేశాలు, మలేషియా తదితర దేశాలకు చెందిన భక్తులు మా కైలాస దేశానికి రాకూడదని, మేము కరోనాను దగ్గరకు కూడా రానివ్వమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నిత్యానంద మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది.

  నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా ?

  నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా ?


  నీకు దిక్కుమాలిన భక్తులు కొందరు ఉన్నారు అంతే, అంతమాత్రానికే నువ్వు దేవుడివి అని ఫీలైపోతున్నావా ? అంటూ కొందరు నెటిజట్లు నిత్యానందపై మండిపడుతున్నారు. నిత్యానంద విడుదల చేసిన వీడియో చూసిన భారతీయులు నువ్వు గనుక భారత్ పోలీసులకు చిక్కితే అప్పుడు నీకు ఉంటుంది నాసామి రంగా ? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

  నిత్యానంద కోసం భారత్ పోలీసుల డేగకన్ను !

  నిత్యానంద కోసం భారత్ పోలీసుల డేగకన్ను !

  మొత్తం మీద సొంతంగా కైలాస దేశాన్ని, సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకుని డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్ని నిత్యానంద కోసం భారత్ పోలీసులు చాలా కాలంగా ఆయన ఆచూకి కోసం ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద పుట్టిన గడ్డ నుంచి ఏ ఒక్కరు మా కైలాస దేశానికి రాకూడదని నో ఎంట్రీ బోర్డు పెట్టిన నిత్యానంద ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

  English summary
  COVID-19: Amid raging Covid-19 second wave in India, Fugitive self-styled godman Swami Nithyananda, in a statement, said devotees from India would not be allowed to enter his island ‘Kailasa’.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X