బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఐటీ హబ్ లో కరోనా జోన్లు జంప్, లాక్ డౌన్ దెబ్బతో ప్రజలు రింగరింగ రింగారింగా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశ ఐటీ, బీటీ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా బెంగళూరు నగరానికి వచ్చి వెళ్లే వారి సంఖ్య రింగరింగ రింగారింగా అంటూ పెరిగిపోవడంతో ఆ నగరంలో కరోనా వైరస్ కంటోన్మెంట్ జోన్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగళూరు సిటీలో ఇఫ్పుడు కొత్త వారిని చూస్తే ప్రతిఒక్కరికి కరోనా భయం పట్టుకుంటోందని స్థానికులే స్వయంగా చెబుతున్నారు.

Coronavirus: మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా పాజిటివ్, లక్ష కేసులతో సినిమా కష్టాలు !Coronavirus: మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా పాజిటివ్, లక్ష కేసులతో సినిమా కష్టాలు !

కరోనా దెబ్బకు ఐటీ హబ్ హడల్

కరోనా దెబ్బకు ఐటీ హబ్ హడల్

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువ ఏమీ లేదు. ఇటీవల నానా హంగామా చేసిన బెంగళూరు నగరంలోని బీబీఎంపీ పాదరాయనపుర వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. పాదరాయనపుర ప్రాంతం చాలా రోజుల నుంచి కంటోన్మెంట్ జోన్ లోనే ఉంది.

 రెండు రోజుల క్రితం !

రెండు రోజుల క్రితం !


బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు పరిధిలో 198 వార్డులు ఉన్నాయి. జూన్ 8వ తేదీ వరకు బెంగళూరు నగరంలో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జూన్ 8వ తేదీ నాటికి బెంగళూరు నగరంలో మొత్తం 52 కరోనా కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

కరోనా కంటోన్మెంట్ జోన్లు జంప్ !

కరోనా కంటోన్మెంట్ జోన్లు జంప్ !

రెండు రోజుల క్రితం 52 కరోనా కంటోన్మెంట్లు జోన్లగా ఉన్న బెంగళూరులో జూన్ 10వ తేదీకి 64 కంటోన్మెంట్లు జోన్లు అయ్యాయి. ఒక్కసారిగా బెంగళూరులో కరోనా కంటోన్మెంట్ జోన్ల సంఖ్య పెరిగిపోవడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. మొత్తం 64 వార్డుల్లోని ప్రజలపై అధికారులు నిఘా వేశారు.

లాక్ డౌన్ సడలింపుల దెబ్బ

లాక్ డౌన్ సడలింపుల దెబ్బ


లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా బెంగళూరు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడంతో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. బీబీఎంపీ పరిధిలోని 198 వార్డులోని 11 వార్డులో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని బీబీఎంపీ అధికారులు తెలిపారు. బెంగళూరులో 58 వార్డుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అయ్యిందని, ఇప్పటి వరకు 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: The number of containment zones in Bengaluru shot up in just 24 hours. Till June 8, there were 54 containment zones, now, the city has 64 such areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X