వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంచుకొస్తున్న కరోనా థ‌ర్డ్ వేవ్‌.. ఆంక్ష‌ల‌ వలయంలో రాష్ట్రాలు.. స్కూళ్ళు, కాలేజీలు బంద్

|
Google Oneindia TeluguNews

దేశంలో ఒక‌వైపు మ‌హమ్మారి క‌రోనా, మ‌రోవైపు ఒమిక్రాన్ విజృభింస్తోంది. గ‌త నాలుగైదు రోజుల నుంచి క‌రోనా కేసులు రెట్టింపు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. వారం రోజుల క్రితం.. రోజువారీ కేసులు ఆరు వేలు న‌మోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 27 వేలను దాటేసింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 1,525కు చేరింది. దాంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మైయ్యాయి. ముంచుకొస్తున్న‌ థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యాయి. కఠిన అంక్ష‌ల‌ను అమలు చేస్తున్నాయి. ప‌లు రాష్ట్రాలు ముంద‌స్తు చ‌ర్య‌ల‌లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, పార్కులను మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేశాయి.

 స్కూల్స్‌, కాలేజీలు మూసివేత‌.

స్కూల్స్‌, కాలేజీలు మూసివేత‌.

క‌రోనా కేసుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌శ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టంది. వైర‌స్ క‌ట్టడి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఉన్న‌తాధికారుల‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. రేప‌టి (సోమ‌వారం ) నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు, మూసివేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప‌శ్చిమ‌బెంగాల్ చీఫ్ సెక్రెట‌రీ హెచ్‌కే ద్వివేది వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు 50 శాతం స్టాఫ్‌తో ప‌నిచేస్తాయ‌ని తెలిపారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన అన్ని స‌మావేశాలు వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు.

 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్స్, బార్లు..

50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్స్, బార్లు..

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు ప‌శ్చిమ‌బెంగాల్ సీఎస్ ద్వివేది కోరారు. రెస్టారెంట్‌, బార్లు 50 శాతం సీటింగ్ తో నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రాత్రి 10గంటలకు మూసివేయాలని ఆదేశించారు. స్పా, బ్యూటీ పార్లర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్‌లు, వెల్‌నెస్ సెంటర్లు మంగళవారం నుంచి మూతపడనున్నాయనిపేర్కొన్నారు.

1 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూళ్లు మూసివేత‌

1 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూళ్లు మూసివేత‌


త‌మిళానాడు ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెరుగుతున్న క‌రోనా, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా 1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని సూచించింది. జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

 క‌ఠినంగా ఆంక్ష‌లు

క‌ఠినంగా ఆంక్ష‌లు

మరో వైపు ఢిల్లీ , మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌ల‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆరాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేశాయి. ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లను పూర్తి మూసివేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబాయిలో 144 సెక్ష‌న్ అమలు చేస్తోంది. థియేటర్లు, రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తెలంగాణలో ర్యాలీలు, రాజకీయ పార్టీల స‌భ‌లు, సాంస్కృతిక ఉత్సవాలకు అనుమతులు లేద‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదేశించింది..

English summary
Corona, Omicron tension in india, west bengal schools, colleges shuts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X